Fenugreek Seeds : భారతీయులు మెంతులను ఎంతో పురాతన కాలం నుంచి మెంతులను తమ వంటి ఇంటి పోపు దినుసుగా ఉపయోగిస్తున్నారు. మెంతులతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మెంతులను ఆయుర్వేదంలో దివ్యౌషధంగా పరిగణిస్తారు. వీటితో అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే పరగడుపునే మెంతుల పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మెంతుల పొడిని ఉదయాన్నే పరగడుపునే ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి మెంతులు ఎంతగానో మేలు చేస్తాయి. మెంతుల పొడిని రోజూ తీసుకుంటుంటే షుగర్ అదుపులోకి వస్తుంది. తద్వారా ఇతర వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
2. శరీరంలో రోజూ కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగిపోతాయన్న సంగతి తెలిసిందే. అయితే ఆ స్థాయిలు మరీ ఎక్కువైతే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మెంతుల పొడిని రోజూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
3. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు మెంతులను తీసుకోవడం వల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. దీని వల్ల మెటబాలిజం పెరిగి క్యాలరీలు ఖర్చువుతాయి. శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. కనుక రోజూ పరగడుపునే మెంతుల పొడిని తీసుకోవాలి.
4. గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉన్నవారు రోజూ మెంతుల పొడిని తీసుకోవడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు,
5. శిరోజాల సంరక్షణకు మెంతుల పొడి ఎంతగానో ఉపయోగపడుతుంది. మెంతుల పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి జుట్టుకు బాగా రాసి గంట సేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో 3 సార్లు చేస్తే జుట్టు సమస్యలు పోతాయి. చుండ్రు తగ్గుతుంది. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. వెంట్రుకలు చిట్లిపోకుండా ఉంటాయి.
మెంతుల పొడిని వాసన చూస్తే కొందరికి వాంతికి వచ్చినట్లు వికారంగా అనిపిస్తుంది. అలాంటి వారు దాన్ని మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు. లేదా ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవచ్చు.