ఒత్తిడిని త‌గ్గిస్తూ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే బ్ర‌హ్మి.. ఇంకా ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

అనారోగ్య స‌మ‌స్య‌లు, ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే మ‌నం శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాలన్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది స‌హ‌జ‌సిద్ధ‌మైన ఆరోగ్య ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తున్నారు. ముఖ్యంగా ఆయుర్వేదం ప‌ట్ల ఆద‌ర‌ణ పెరుగుతోంది. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు ఆయుర్వేద విధానాన్ని పాటిస్తున్నారు. ఇక ఆయుర్వేదంలో బ్ర‌హ్మి అనే మూలిక‌కు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of brahmi

1. బ్ర‌హ్మిని తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఏకాగ్ర‌త పెరుగుతుంది. మెద‌డు సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. రోజుకు 300 మిల్లీగ్రాముల మోతాదులో బ్ర‌హ్మిని 6 వారాల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని సైంటిస్టులు తెలిపారు. మెద‌డులోని నాడుల ప‌నితీరును ఈ మూలిక మెరుగు ప‌రుస్తుంది. దీంతో జ్ఞాప‌క‌శ‌క్తి, నేర్చుకునే త‌త్వం పెరుగుతాయి.

2. బ్ర‌హ్మిని తీసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల ఎంజైమ్‌లు యాక్టివేట్ అవుతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. మూడ్ మారుతుంది. కార్టిసోల్ స్థాయిలు త‌గ్గుతాయి. ఇది ఒత్తిడికి కార‌ణ‌మ‌య్యే హార్మోన్‌. క‌నుక ఆ హార్మోన్ ప్ర‌భావం త‌గ్గుతుంది. శరీరంలో సెరోటోనిన్ స్థాయిలు పెరుగుతాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

3. అల్జీమ‌ర్స్ వ్యాధి వ‌చ్చిందంటే దాదాపుగా న‌యం కాదు. కానీ ఈ వ్యాధి వ‌ల్ల మెద‌డుపై పడే ప్ర‌భావాన్ని బ్ర‌హ్మితో త‌గ్గించ‌వ‌చ్చు. దీంతో జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. మ‌తిమ‌రుపు త‌గ్గుతుంది.

4. రోజూ యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల శ‌రీరంలోని క‌ణాలు దెబ్బ‌తిన‌కుండా ఉంటాయి. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్, క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రావు. బ్ర‌హ్మిలో ఉండే బేకోసైడ్స్ అనే స‌మ్మేళ‌నం ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తుంది. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

5. మ‌న శ‌రీరంలో వాపులు, నొప్పుల‌కు కార‌ణం అయ్యే సైక్లోజెనెసిస్‌, కాస్పెసెస్‌, లైపోజైజెన‌సెస్ అన‌బ‌డే ఎంజైమ్‌ల‌ను బ్ర‌హ్మి అడ్డుకుంటుంది. దీంతో ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

6. వెంట్రుక‌లు పొడుగ్గా, ఆరోగ్యంగా ఉంటేనే చాలా మంది సంతృప్తిగా ఫీల‌వుతారు. అయితే కొంద‌రికి జుట్టు స‌మ‌స్య‌లు ఉంటాయి. అలాంటి వారు బ్ర‌హ్మిని రోజూ తీసుకోవాలి. దీంతో జుట్టు కుదుళ్లు దృఢంగా మారుతాయి. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts