కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఆవశ్యకం అయింది. యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీర అంతర్గత వ్యవస్థను దృఢంగా ఉంచుకోవచ్చు. ఇక పలు రకాల సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన హెర్బల్ డికాషన్‌ను తాగడం వల్ల అంతర్గత వ్యవస్థ దృఢంగా మారడంతోపాటు వ్యాధులను కలగజేసే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ఈ క్రమంలోనే శరీర రోగ నిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక పాత్ర తీసుకుని అందులో 2 లీటర్ల నీటిని పోయాలి. దాల్చిన చెక్క, వెల్లుల్లి రెబ్బలు, తురిమిన అల్లం, తులసి ఆకులు, మెంతులు వేసి కొన్ని నిమిషాల పాటు మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు మంటను తగ్గించి మరో 3 లేదా 4 నిమిషాల పాటు సిమ్మర్‌లో ఉంచి మరిగించాలి. గ్యాస్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని వడకట్టాలి. అందులో ఒక నిమ్మకాయ రసాన్ని పూర్తిగా పిండాలి. అవసరం అనుకుంటే తేనెను కలుపుకోవచ్చు. దీన్ని రోజుకు 2 సార్లు తాగవచ్చు. దీన్ని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
రోగ నిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీని తయారు చేసేందుకు అవసరం అయ్యే పదార్థాలన్నీ మన ఇళ్లలోనే సులభంగా లభిస్తాయి. అందువల్ల ఈ టీని తయారు చేసేందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. ఈ టీలో తులసి ఆకులు ఉంటాయి కనుక సహజసిద్ధమైన ఇమ్యూనిటీ బూస్టర్‌గా అవి పనిచేస్తాయి. దీంతో ఇన్‌ఫెక్షన్లు, వాపులు తగ్గుతాయి. ఈ టీ లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. కనుక శ్వాసకోశ వ్యవస్థ ఇన్‌ఫెక్షన్లు రావు. జ్వరం, జలుబు, దగ్గు, ఇతర వైరస్ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు ఈ టీని తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది.
ఈ టీలో పాలిఫినాల్స్, ప్రొ ఆంథోసయనైడిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కనుక దీంతో సూక్ష్మ క్రిముల ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. శరీరంలో ద్రవాలు సమతుల్యంగా ఉంటాయి. గ్యాస్, అజీర్ణం, ఇతర జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఈ టీలో ఉండే సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఈ టీని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365