Sugandhi Root Powder : ఈ వేర్ల పొడిని కాస్త తీసుకుంటే చాలు.. ర‌క్తం మొత్తం శుభ్ర‌మ‌వుతుంది..!

Sugandhi Root Powder : అనేక ఔష‌ధ గుణాలు క‌లిగిన మూలిక‌ల‌ల్లో సుగంధ పాల వేర్లు కూడా ఒక‌టి. వీటి గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో శ‌రీరానికి చ‌లువ చేయ‌డానికి ష‌ర్బ‌త్ ల త‌యారీలో దీనిని వాడుతూ ఉంటారు. శ‌రీరానికి చ‌లువ చేయ‌డంతో పాటు సుగంధ పాల వేర్లు అనేక ఇత‌ర ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ఈ సుగంధ పాల వేర్లు మ‌న‌కు ఆయుర్వేద షాపుల్లో ఎక్కువ‌గా ల‌భిస్తూ ఉంటాయి. వీటిల న‌ల్ల సుగంధి, ఎర్ర సుగంధి, దేశీయ సుగంధి ఇలా అనేక ర‌కాలు ఉంటాయి. ఈ సుగంధి వేర్ల‌తో క‌షాయాన్ని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు.

సుగంధ వేర్ల‌తో క‌షాయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. క‌షాయం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల మ‌న‌క క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సుగంధ వేర్ల‌తో క‌షాయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం 4 లేదా 5 గ్రాముల సుగంధ వేర్ల బెర‌డు పొడి, 4 మిరియాల‌ను, 2 యాల‌కుల‌ను, ఒక చిన్న అల్లం ముక్క‌ను, 10 పుదీనా ఆకుల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో రెండు క‌ప్పుల నీళ్లు పోసిఅందులో సుగంధ వేర్ల పొడి, అల్లం, మిరియాలు, యాల‌కులు వేసి నీటిని బాగా మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత వ‌డ‌క‌ట్టి అందులో పుదీనా ఆకులు, తేనె వేసి క‌లిపి తాగాలి. ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల మన శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

Sugandhi Root Powder take this daily for many benefits in telugu
Sugandhi Root Powder

దీనిలో యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. సుగంధి వేర్ల‌తో ఈ విధంగా క‌షాయాన్ని చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. సుంగ‌ధ వేర్ల‌తో చేసిన క‌షాయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం శుభ్ర‌ప‌డుతుంది. శ‌రీరంలో వేడి త‌గ్గుతుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల మూత్రాశ‌య ఇన్పెక్ష‌న్ లు కూడా మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. ఈవిధంగా సుగంధ వేర్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంతో మేలు క‌లుగుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts