Neem Leaves : ఔషధ గుణాలు కలిగిన మొక్క అనగానే మనలో చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది వేప చెట్టు. వేప చెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుందని అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుందని మనందరికీ తెలుసు. వేప చెట్టు గాలి తగిలితేనే రోగాలు పరుగులు తీస్తాయని పెద్దలు చెబుతుండే వారు. వేపచెట్టు ఆకులు, కాయలు, కాండం, బెరడు, పువ్వులు, వేర్లు ఇలా ప్రతి భాగం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.
వేప చెట్టులో ఉపయోగపడని భాగం ఒకటి కూడా లేదని చెప్పవచ్చు. వేప ఆకులకు చర్మ రోగాలను నయం చేసే శక్తి ఉంది. వేప ఆకులను పసుపుతో కలిపి నూరి చర్మంపై రాయడం వల్ల దదుర్లు, దురదలు, మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు ఒక కప్పు వేప ఆకులను, రెండు ఉసిరి కాయలతో కలిపి మెత్తగా నూరి తలకు బాగా పట్టించడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. ఇందులో ఉసిరి కాయలకు బదులుగా నిమ్మ రసాన్ని కూడా వాడవచ్చు.
వేప చెట్టు పుల్లలతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాల సమస్యలు తగ్గి దంతాలు గట్టిగా తయారవుతాయి. వేప చెట్టు కింద నిలబడడం వల్ల ఎండ వల్ల కలిగే నీరసం తగ్గుతుంది. ఇలా ఒకటి రెండూ కాకుండా మనకు వచ్చే వెయ్యి రకాల అనారోగ్య సమస్యలను తగ్గించే శక్తి వేప చెట్టుకు ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
వేప ఆకులను నాలుగైదు తీసుకుని నూరి మిశ్రమంగా చేయాలి. అనంతరం దీన్ని బఠానీ గింజంత సైజులో గోలీలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న మాత్రలను గాజు సీసాలో నిల్వ చేయాలి. వీటిని రోజుకు రెండు చొప్పున.. ఉదయం, సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సమస్త జీర్ణ సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది.
ఇలా వేప ఆకులను తీసుకోడం వల్ల షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. హార్ట్ ఎటాక్ లు రాకుండా చూసుకోవచ్చు. జీర్ణవ్యవస్థలో ఉండే క్రిములు నశిస్తాయి. ఇలా వేప ఆకులతో అనేక లాభాలను పొందవచ్చు.