భారతీయులందరి ఇళ్లలోనూ పసుపు ఉంటుంది. దీన్ని వంటల్లో ఉపయోగిస్తారు. దీంతో వంటలకు చక్కని రుచి, రంగు వస్తాయి. పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని ఎంతో కాలం నుంచి చికిత్సల కోసం ఉపయోగిస్తున్నారు. పసుపు అల్లం కుటుంబానికి చెందుతుంది. ఇందులో అనేక సమ్మేళనాలు ఉంటాయి. అవి ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. పసుపులో కర్కుమినాయిడ్స్ ఉంటాయి. వాటిలో కర్కుమిన్ ముఖ్యమైంది. పసుపు మన శరీరానికి, మెదడుకు ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని రోజూ ఆహారంలో తీసుకోవచ్చు. లేదా సప్లిమెంట్లు కూడా లభిస్తున్నాయి. వాటిని వైద్యుల సూచన మేరకు వాడుకోవాలి. పసుపు వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మన శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మ క్రిములను పసుపు నాశనం చేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం వాపులను తగ్గిస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తాయి.
3. పసుపులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. దీంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్‌లోని విషపదార్థాలు, ఇతర వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. పసుపును రోజూ తీసుకోవడం వల్ల దెబ్బ తిన్న లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
4. ఆయుర్వేద ప్రకారం పసుపు జీర్ణ సమస్యలను తగ్గించే అద్భుతమైన పదార్థంగా చెప్పబడింది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం గాల్ బ్లాడర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. అధ్యయనాల ప్రకారం.. పసుపును తీసుకోవడం వల్ల గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.
5. పసుపులో లైపోపాలిశాకరైడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని వల్ల శరీరంలోని సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి రోజూ రాత్రి నిద్రించే ముందు తీసుకోవాలి. ఫ్లూ రాకుండా ఉంటుంది.
6. పసుపులో ఉండే టర్మరోన్ అనబడే అరోమాటిక్ సమ్మేళనం మెదడుకు ఎంతో మేలు చేస్తుంది. ఇది మెదడులో దెబ్బ తిన్న కణాలను రిపేర్ చేస్తుంది. అలాగే పసుపులో ఉండే కర్కుమిన్ మెదడులోని కొన్ని రకాల ప్రోటీన్లకు శక్తినిస్తుంది. దీంతో మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. విద్యార్థులకు రోజూ పసుపును ఇవ్వడం వల్ల వారి మెదడు చురుగ్గా మారుతుంది. చదువుల్లో రాణిస్తారు.
7. వయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సరే చర్మం మీద ముడతలు పడతాయి. వృద్ధాప్య ఛాయలు వస్తుంటాయి. కానీ పసుపును రోజూ తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. యవ్వనంగా కనిపిస్తారు. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడేటివ్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాల వల్లే ఇది సాధ్యమవుతుంది. వయస్సు మీద పడడాన్ని పసుపు తగ్గిస్తుంది. దీంతో చర్మం ప్రకాశవంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది.
8. అధిక బరువును తగ్గించడంలో పసుపు సహాయ పడుతుంది. ఒత్తిడి హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటే బరువు పెరుగుతారు. కనుక ఆ హార్మోన్లను పసుపు నియంత్రిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు. అలాగే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.