బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించే మూలిక‌లు ఇవి.. ఎలా వాడాలో తెలుసుకోండి..!

డ‌యాబెటిస్ స‌మ‌స్య అనేది చాలా మందికి వ‌స్తోంది. వంశ పారంప‌ర్యంగా వ‌చ్చే టైప్ 1 డ‌యాబెటిస్ మాత్ర‌మే కాదు, అస్త‌వ్యస్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల వ‌చ్చే టైప్ 2 డ‌యాబెటిస్ బాధితుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. అయితే టైప్ 2 డ‌యాబెటిస్‌ను పూర్తిగా త‌గ్గించుకోవ‌డం సాధ్య‌మే అని చెప్ప‌వ‌చ్చు. కానీ ఎవ‌రికి వారు క‌ఠిన నియ‌మాల‌ను పాటిస్తేనే అది సాధ్య‌మ‌వుతుంది. అయితే అన్ని నియ‌మాల‌తోపాటు కింద తెలిపిన మూలిక‌ల‌ను వాడుతుంటే టైప్ 2 డ‌యాబెటిస్‌ను తగ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ మూలిక‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

these herbs will reduce blood sugar levels know how to use them

* మ‌ధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు తిప్ప‌తీగ బాగా ప‌నిచేస్తుంది. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తిప్ప‌తీగ జ్యూస్‌ను 30 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి. తిప్ప‌తీగకు చెందిన ట్యాబ్లెట్లు కూడా మ‌న‌కు ల‌భిస్తున్నాయి. వాటిని ప్యాక్‌పై సూచించిన విధంగా వాడుకోవ‌చ్చు. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.

* షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకునేందుకు విజ‌య‌సారం కూడా ప‌నిచేస్తుంది. ఈ చూర్ణాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తీసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.

* పొడ‌ప‌త్రి ఆకు చూర్ణాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి రోజూ ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి 30 నిమిషాల ముందు తాగాలి. పొడ‌ప‌త్రి ట్యాబ్లెట్లు కూడా ల‌భిస్తాయి. వాటిని వాడుకోవ‌చ్చు.

* బిళ్ల గ‌న్నేరు పువ్వులు 2 తీసుకుని ఒక క‌ప్పు నీటిలో వేసి మ‌రిగించాలి. దాన్ని ప‌ర‌గ‌డుపునే తాగాలి. షుగ‌ర్ త‌గ్గుతుంది.

Share
Admin

Recent Posts