మూలిక‌లు

నేరేడు పండ్ల‌ను తిన్నాక విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. వాటితో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు..!

వేస‌వి కాలం ముగింపుకు వ‌స్తుందంటే చాలు మ‌న‌కు ఎక్క‌డ చూసినా నేరేడు పండ్లు క‌నిపిస్తుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నేరేడు పండ్లు మ‌న‌కు విరివిగా లభిస్తాయి. ఇవి రుచిగా ఉంటాయి. అయితే నేరేడు పండ్ల‌ను తిన్న త‌రువాత చాలా మంది విత్త‌నాల‌ను ప‌డేస్తారు. కానీ వాటితోనూ మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. కింద తెలిపిన విష‌యాల‌ను తెలుసుకుంటే ఇక‌పై మీరు నేరేడు పండ్ల‌ను తిన్న త‌రువాత విత్త‌నాల‌ను ప‌డేయ‌రు. నేరేడు విత్త‌నాల‌ను ఎండ బెట్టి పొడి చేసి దాన్ని రోజూ 2-4 గ్రాముల మోతాదులో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

using jamun seeds you can get rid of health problems

 

1. రక్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో నేరేడు విత్త‌నాలు బాగా ప‌నిచేస్తాయి. ఈ విత్త‌నాల్లో జాంబోలైన్‌, జంబోసైన్ అన‌బ‌డే స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. ఇన్సులిన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తాయి.

2. అనేక ర‌కాల జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ నేరేడు విత్త‌నాలు బాగ ప‌నిచేస్తాయి. వీటిల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. నేరేడు విత్త‌నాల పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల వాపులు, అల్స‌ర్లు త‌గ్గుతాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది.

3. హైబీపీ ఉన్న‌వారు నేరేడు విత్త‌నాల పొడిని తీసుకుంటే మంచిది. ఈ విత్త‌నాల్లో ఎల్లాజిక్ యాసిడ్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది.

4. నేరేడు విత్త‌నాల్లో శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్లేవ‌నాయిడ్లు, ఫినోలిక్ స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి శ‌రీరంలోని ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను తొల‌గిస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.

5. అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు నేరేడు విత్త‌నాల పొడిని వాడాలి. వాటిలో ఉండే ఫైబ‌ర్ క‌డుపు నిండిన భావ‌న క‌లిగిస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంది.

నేరేడు విత్త‌నాల పొడిని నేరుగా తీసుకోవ‌చ్చు. లేదా రోజూ తినే ఆహారంపై చ‌ల్లి తీసుకోవ‌చ్చు. దీంతో పైన తెలిపిన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts