Thyroid : థైరాయిడ్ స‌మ‌స్య‌కు దీంతో శాశ్వ‌త ప‌రిష్కారం.. నిపుణులు చెబుతున్న మాట‌..!

Thyroid : థైరాయిడ్ గ్రంథి.. దీనినే అవ‌టు గ్రంథి అని కూడా అంటారు. ఇది మెడ మ‌ధ్య భాగంలో గొంతు ముందుండే అవ‌య‌వం. ఇది వినాళ‌ గ్రంథుల‌న్నింటిలో కంటే పెద్ద‌ది. శ‌రీరంలోని ముఖ్య‌మైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒక‌టి. ఇది శారీర‌క ఎదుగుద‌ల‌లో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తుంది. ఇది గ్రంథి ప‌నితీరు అదుపు త‌ప్ప‌డం వ‌ల్ల హైపో థైరాయిడిజం, హైప‌ర్ థైరాయిడిజం వంటి స‌మ‌స్య‌ల‌తోపాటు ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌లు కూడా ఏర్ప‌డ‌తాయి. ఈ థైరాయిడ్ గ్రంథి అయోడిన్ క‌లిగిన థైరాక్సిన్ అనే హార్మోన్ ను స్ర‌విస్తుంది. ఇది సాధార‌ణ జీవ‌క్రియ‌ వేగాన్ని నియంత్రిస్తుంది. థైరాయిడ్ గ్రంథి నుండి విడుద‌ల అయ్యే హార్మోన్ లు ప్ర‌తి క‌ణం పైన ప్ర‌భావాన్ని చూపిస్తాయి. ఇది ఎముక‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే క్యాల్షియంను క్యాల్సిటోనిన్ హార్మోన్ ద్వారా స‌మ‌ర్థ‌వంతంగా కాపాడుతుంది.

థైరాయిడ్ గ్రంథి టి3, టి4 , క్యాల్సిటోనిన్ హార్మోన్ ల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. శ‌రీర అవ‌స‌రాల నిమిత్తం ర‌క్తంలో హార్మోన్ ల శాతం త‌గ్గ‌డం లేదా పెర‌గ‌డం చాలా సాధార‌ణం. మారిన హార్మోన్ల నిల్వ‌ల వ‌ల్ల క‌లిగే అనారోగ్య ల‌క్ష‌ణాల‌కు స‌రైన చికిత్స తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల అది హైపోథైరాయిడ్, ఆర్థ‌రైటిస్ వంటి స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. థైరాయిడ్ అస‌మ‌తుల్య‌త వ‌ల్ల కీళ్ల‌ల్లో వ‌చ్చే అతి పెద్ద స‌మ‌స్య ఆర్థ‌రైటిస్. అంటే కీళ్ల‌లోప‌ల అంతా వాచిపోయి క‌దిపితే తీవ్ర‌మైన నొప్పి వ‌స్తుంది. కేవ‌లం ఆర్థ‌రైటిస్ వంటి సమ‌స్య‌లే కాకుండా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశం కూడా ఉంటుంది. ఎన్ని మందులు వాడినా తాత్కాలిక ఉప‌శ‌మ‌న‌మే త‌ప్ప ఈ థైరాయిడ్ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భించ‌దు.

you can get relief from Thyroid with Ashwagandha
Thyroid

కానీ ఈ థైరాయిడ్ స‌మ‌స్య‌ను శాశ్వ‌తంగా రూపుమాప‌వ‌చ్చ‌ట‌. థైరాయిడ్ ను రూపుమాప‌డంలో అశ్వ‌గంధ‌ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. దీనిని హైపో, హైప‌ర్ థైరాయిడ్ ల‌కు మందుగా వాడ‌వ‌చ్చు. ఈ అశ్వగంధ మొక్క ఎక్కువ‌గా పొడి ప్రాంతాల్లో పెరుగుతుంది. ఆయుర్వేదంలో అశ్వ‌గంధ మొక్క‌ను అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. దీనిని కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా అంటారు. థైరాయిడ్ గ్రంథి మ‌న శ‌రీరానికి వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌కుండా నివారించ‌డంలో అశ్వ‌గంధ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

అశ్వ‌గంధ అడాప్టోజెన్ గా పని చేస్తుంది. ఇది థైరాయిడ్ స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మనాన్ని క‌లిగించి ఆరోగ్యాన్నిపెంపొదిస్తుంది. అడాప్టోజెన్ లు అన్ని ర‌కాల వ‌య‌సుల వారికి ప‌ని చేస్తాయి. దీనిని ప‌లు ర‌కాల వ్యాధులు ఉన్న వారు కూడా చికిత్స‌గా వాడుకోవ‌చ్చు. శాస్త్ర‌వేత్త‌లు వీటిపై ప‌రిశోధ‌న‌లు జ‌రిపి ఇవి శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయ‌ని పేర్కొన్నారు. ఈ ఔష‌ధాన్ని కొన్ని సంవ‌త్స‌రాలుగా థైరాయిడ్ వ్యాధిగ్ర‌స్తుల‌కు టానిక్ గా వాడుతున్నారు. క‌నుక‌ దీనిని దీర్ఘ‌కాలికంగా వాడినా కూడా ఎటువంటి దుష్ప్ర‌భావాలు క‌ల‌గ‌వు.

అశ్వ‌గంధ పొడి రూపంలో కూడా ల‌భిస్తుంది. పొడి రూపంలో తీసుకోలేని వారు దీంతో టీ ని చేసుకుని తాగ‌వ‌చ్చు. ఈ అశ్వ‌గంధ చూర్ణానికి తుల‌సి ఆకుల‌ను క‌ల‌ప‌డం వ‌ల్ల దీని శ‌క్తి మ‌రింత‌గా పెరుగుతుంది. అశ్వ‌గంద‌ను 2 నుండి 3 నెల‌ల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా వాడ‌డం వ‌ల్ల మాత్ర‌మే మ‌న‌కు ఫ‌లితం క‌న‌బ‌డుతుంది. అశ్వగంధ‌ను ఔష‌ధంగా వాడి థైరాయిడ్ స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొందిన వారు కూడా ఉన్నార‌ని, దీనిని వాడ‌డం వ‌ల్ల థైరాయిడ్ స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts