Curd : మనం సాధారణంగా ప్రతిరోజూ భోజనంలో లేదా ఇంకా చాలా రకాలుగా పెరుగును ఏదో ఒక రూపంలో తీసుకుంటూనే ఉంటాం. మనలో తాజా గడ్డ పెరుగును ఇష్టపడని వారు చాలా అరుదుగా కనిపిస్తారు. ముఖ్యంగా తెలుగు వారిలో చాలా మందికి ఆహారంలో పెరుగు లేనిదే భోజనం పూర్తవదు. ఇక పెరుగు తినడం వలన అది మన శరీరాన్ని చల్ల బరుస్తుందని, అలాగే జీర్ణాశయానికి కూడా మంచిదని నమ్ముతారు. పెరుగులో ఉండే బాక్టీరియా జీర్ణశక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. దీనిలో ఉండే విటమిన్స్, మినరల్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పాలను పులియబెట్టినపుడు బాక్టీరియా వృద్ధి చెందడం వలన లాక్టిక్ యాసిడ్ ఎర్పడుతుంది. దీని వలన పెరుగు తయారవుతుంది.
పెరుగుతో ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో ఫాస్పరస్, కాల్షియం, విటమిన్ బి2, విటమిన్ బి12, మెగ్నిషియం ఇంకా పొటాషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పెరుగులో ఉండే మంచి బాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే పెరుగులో ఉండే కొన్ని పోషకాలు వివిధ రకాలైన ఇతర ఆహార పదార్థాలలో కలిపి తీసుకున్నపుడు మన శరీరానికి హానికారకంగా మారే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే అవి ఆరోగ్యకరమైనవే అయిన్పటికీ కొన్ని సందర్భాల్లో మంచి కంటే ఎక్కువగా హాని చేసేందుకు ఆస్కారం ఉంటుందట. ఆ పదార్థాలు ఏమిటో, అవి దేహానికి ఏ విధంగా ప్రమాదకరం అవుతాయో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చేపలను ఇంకా పెరుగును కలిపి తినకూడదు. రెండింటిలోనూ ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. చేపల నుండి వచ్చేవి జంతు ప్రొటీన్లు కాగా పెరుగు ద్వారా శాకాహార ప్రొటీన్లు అందుతాయి. ఇవి రెండూ పొట్టలో కలిసినపుడు జీర్ణక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంకా జీర్ణాశయానికి ఇతర సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మామిడి పండును కూడా పెరుగుతో కలిపి తినకూడదు. ఇలా తిన్నప్పుడు మామిడి వలన కలిగే వేడి, పెరుగు వలన కలిగే చల్లదనంతో జీర్ణాశయంలో అసమతుల్యత, అలాగే చర్మ సమస్యలు ఉత్పన్నమవుతాయి.
అలాగే ఉల్లిపాయను పెరుగుతో కలిపి తిన్నపుడు కూడా స్కిన్ ఎలర్జీలు ఇంకా ఇతర చర్మ సమస్యలకు కారణమవుతుంది. అంతే కాకుండా పాలను, పెరుగును ఒకేసారి తీసుకున్నప్పుడు యాసిడిటీ, గ్యాస్, విరేచనాలు, కడుపు ఉబ్బరం మొదలైన ఇబ్బందులు వస్తాయి. అలాగే నూనె పదార్థాలను కూడా పెరుగుతో కలిపి తీసుకోకూడదు. దీని వలన జీర్ణక్రియ నెమ్మదించి, బద్దకం, నిద్ర మత్తుగా ఉండటం లాంటివి జరుగుతాయి. ఈ విధంగా పెరుగును పైన చెప్పిన ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం ఆపివేసినట్లైతే దాని వలన వచ్చే ఆరోగ్య సమస్యల నుండి కాపాడుకోవచ్చు.