గొంతులో నొప్పి, ఇత‌ర గొంతు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే 5 స‌హ‌జ‌సిద్ధ‌మైన డ్రింక్స్‌..!

గొంతు నొప్పి, గొంతులో ఇబ్బందిగా ఉంటే చిరాకుగా అనిపిస్తుంది. దుర‌ద వ‌స్తుంది. ఒక ప‌ట్టాన త‌గ్గ‌దు. దీంతో అవ‌స్థ క‌లుగుతుంది. శ‌రీరంలో బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు ఏర్ప‌డిన‌ప్పుడు వాటిని త‌గ్గించేందుకు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ యాక్టివేట్ అవుతుంది. దీంతో గొంతులో స‌హ‌జంగానే ఇబ్బందులు ఏర్ప‌డుతుంటాయి. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ గొంతులో వాపుల‌ను క‌లిగించి బాక్టీరియా, వైర‌స్‌ల‌పై పోరాటం చేస్తుంది. దీంతో గొంతులో ఇబ్బందిగా అనిపిస్తుంది. గొంతు నొప్పి వ‌స్తుంది. ఆ త‌రువాత జ‌లుబు, ద‌గ్గు, ఫ్లూ, అల‌ర్జీలు వ‌స్తాయి. అయితే ఈ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు కింద తెలిపిన డ్రింక్స్‌ను తాగాల్సి ఉంటుంది. అవేమిటంటే..

5 best natural drinks for sore throat and throat pain

1. రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా ప‌సుపు, నెయ్యిల‌ను క‌లుపుకుని తాగితే గొంతు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. గొంతు నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

2. గొంతు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో అల్లం, దాల్చిన చెక్క‌, అతి మ‌ధురంలు కూడా ప‌నిచేస్తాయి. 2 టీస్పూన్ల అల్లం ర‌సం, రెండు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, 3 టీస్పూన్ల అతి మ‌ధురం చూర్ణం క‌లిపి నిల్వ చేసుకోవాలి. అందులో నుంచి ఒక టీస్పూన్ మోతాదులో మిశ్ర‌మాన్ని తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి 5 నుంచి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఆ మిశ్ర‌మాన్ని తాగాలి. రోజుకు దీన్ని 3 సార్లు తాగ‌వ‌చ్చు. గొంతు స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

3. అల్లంలో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. ఇవి గొంతు నొప్పిని త‌గ్గిస్తాయి. ఒక క‌ప్పు పాల‌లో ఒక టీస్పూన్ అల్లం ర‌సం క‌లిపి రోజుకు 2 సార్లు సేవించాలి. లేదా ఒక క‌ప్పు నీటిలో ఒక టీస్పూన్ తురిమిన అల్లం వేసి మ‌రిగించి ఆ నీటిని తాగాలి. దీంతో గొంతు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అవ‌సరం అనుకుంటే అందులో తేనెను క‌లుపుకోవ‌చ్చు.

4. పుదీనా ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి గొంతు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు దోహ‌దం చేస్తాయి. ఒక క‌ప్పు నీటిలో కొన్ని పుదీనా ఆకుల‌ను వేసి మ‌రిగించి ఆ నీటిని తాగాలి. రోజుకు ఇలా 3 సార్లు తాగితే గొంతు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. పుదీనా ఆకుల‌ను నీటిలో వేశాక 3 నుంచి 5 నిమిషాల పాటు నీటిని మ‌రిగిస్తే చాలు. పుదీనాలోని ఔష‌ధ గుణాలు నీటిలోకి చేరుతాయి.

5. క‌మోమిల్ (గ‌డ్డి చామంతి) పువ్వుల టీని తాగితే గొంతు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ టీలో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఈ టీని తాగ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. నిద్ర బాగా ప‌డుతుంది. ఈ టీలో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతాయి. దీని వ‌ల్ల గొంతు స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts