ద‌గ్గు, జ‌లుబుపై బ్ర‌హ్మాస్త్రం.. వాము ఆకులు..!

వాము విత్త‌నాలు దాదాపుగా ప్ర‌తి ఇంట్లోనూ ఉంటాయి. ఇవి చ‌క్క‌ని సువాస‌న‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల ఈ విత్త‌నాల‌ను వంట‌ల్లో వేస్తుంటారు. కూర‌ల్లో, పానీయాల్లో వాము విత్త‌నాలను వేసి తింటుంటారు. అలాగే బ్రెడ్‌, ప‌రాఠాల‌పై కూడా వేస్తుంటారు. దీంతో అవి ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. అయితే ఆయుర్వేద ప్ర‌కారం వాము విత్త‌నాల వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

home remedies using ajwain leaves

అయితే వాము విత్త‌నాల గురించి తెలుసు కానీ వాము ఆకుల గురించి చాలా మందికి తెలియదు. నిజానికి వాము మొక్క‌ల‌ను మ‌నం ఇంట్లోనే కుండీల్లో సుల‌భంగా పెంచుకోవ‌చ్చు. వాము విత్త‌నాల్లాగే ఆకులు కూడా ఎంతో సువాస‌న‌ను క‌లిగి ఉంటాయి. ఇవి ఆకుప‌చ్చ రంగుల్లో ద‌ళ‌స‌రిగా ఉంద‌టాయి. వాము విత్త‌నాల్లాగే వాము ఆకుల వ‌ల్ల కూడా మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

1. ద‌గ్గు, జ‌లుబును త‌గ్గించేందుకు వాము ఆకులు బాగా ప‌నిచేస్తాయి. 10-12 వాము ఆకుల‌ను సేక‌రించి శుభ్రంగా క‌డిగి అనంత‌రం వాటిని ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి. నీరు స‌గం అయ్యే వ‌ర‌కు మ‌రిగించాక ఆ మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి. అవ‌స‌రం అనుకుంటే అందులో తేనె క‌లుపుకోవ‌చ్చు. ఈ మిశ్ర‌మాన్ని రోజుకు 2 సార్లు తాగితే ద‌గ్గు, జ‌లుబు త‌గ్గుతాయి.

2. వాము ఆకుల‌తో త‌యారు చేసిన నీటిని తాగ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. అజీర్ణం త‌గ్గుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణ‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అసిడిటీ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

3. వాము ఆకుల నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించ‌డం వ‌ల్ల నోట్లో బాక్టీరియా న‌శిస్తుంది. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

4. గాయాలు, పుండ్ల‌ను త్వ‌ర‌గా మానేలా చేసేందుకు వాము ఆకులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వాము ఆకుల‌ను పేస్ట్‌లా చేసి ఆ మిశ్ర‌మాన్ని సంబంధిత ప్ర‌దేశంలో రాసి క‌ట్టు క‌ట్టాలి. రోజూ ఇలా చేస్తే గాయాలు, పుండ్లు త్వ‌ర‌గా మానుతాయి.

5. వాము ఆకుల‌తో త‌యారు చేసే నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చ‌వుతాయి. కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

6. దోమ‌లు, పురుగులు కుట్టిన చోట వాము ఆకుల పేస్ట్‌ను ఉంచితే నొప్పి, దుర‌ద నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

7. ఆర్థ‌రైటిస్ నొప్పులు ఉన్న‌వారికి వాము ఆకులు మేలు చేస్తాయి. వాము ఆకుల‌ను పేస్ట్‌లా చేసి నొప్పి ఉన్న ప్ర‌దేశంపై రాసి క‌ట్టు క‌డుతుండాలి. నొప్పులు త‌గ్గుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts