ఆరోగ్యవంతమైన మెరిసే చర్మం కోసం చాలా మంది బ్యూటీ ట్రీట్‌మెంట్స్ తీసుకుంటుంటారు. బాగా ఖర్చు చేసి చికిత్స పొందుతుంటారు. కానీ మనం తీసుకునే ఆహారాలు, ద్రవాలపైనే మన చర్మ సంరక్షణ ఆధారపడి ఉంటుంది. అందుకని వేల కొద్దీ రూపాయాలను స్కిన్ ట్రీట్‌మెంట్ కోసం ఖర్చు చేసే బదులు రోజూ గోరు వెచ్చని నీటిని తాగితే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది. మన శరీరంలోని అన్ని అవయవాలు, కణాలు పనిచేసేందుకు, వివిధ జీవక్రియలకు నీరు అవసరం అవుతుంది. అందువల్ల రోజూ కనీసం 7-8 గ్లాసుల నీటిని తాగాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే రోజూ గోరు వెచ్చని నీటిని తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. అదువల్ల గోరు వెచ్చని నీటిని తాగాలని సూచిస్తున్నారు. దీంతో చర్మం సురక్షితంగా ఉంటుంది.
రోజూ ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి మళ్లీ నిద్రించే వరకు గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటుగా చేసుకోవాలి. దీంతో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. చెమట పట్టేలా చేస్తుంది. ఇది శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలను బయటకు పంపేలా చేస్తుంది. దీంతో మొటిమలు పెరగకుండా ఉంటాయి.
గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణవ్యవస్థ సరిగ్గా నిర్వహించబడుతుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక రోజూ ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది.
రోజూ గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. చర్మం తేమను పొందుతుంది. పొడిబారిన చర్మం ఉన్నవారు రోజూ గోరు వెచ్చని నీటిని తాగితే మంచిది. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. చర్మ కణాలకు కావల్సిన పోషకాలు సరిగ్గా అందుతాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
రోజూ గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల దెబ్బ తిన్న చర్మ కణాలకు మరమ్మత్తులు చేసేందుకు గోరు వెచ్చని నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని వల్ల చర్మానికి ఉండే సహజసిద్ధమైన సాగే గుణం పెరుగుతుంది. చర్మంపై ఏర్పడే మచ్చలు, ముడతలు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు.
గోరు వెచ్చని నీరు చర్మానికి, జీర్ణవ్యవస్థ పనితీరుకు ఉపయోగపడుతుంది. దీని వల్ల మలబద్దకం నుంచి బయట పడవచ్చు. ఉదయాన్నే పరగడుపునే గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. సుఖ విరేచనం అవుతుంది. అవయవాలు శుభ్రమవుతాయి. చర్మం ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా సురక్షితంగా ఉంటుంది. మెటబాలిజం పెరిగి అధిక బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఇలా గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
అయితే బాగా మరుగుతున్న వేడి వేడి నీటిని తాగరాదు. గోరు వెచ్చగా ఉండే నీటిని మాత్రమే తాగాలి. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలు పొందవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365