మనలో చాలా మంది తరుచూ చెవి ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఎంతో బాధపడుతుంటారు. ముఖ్యంగా పెద్ద వారితో పోలిస్తే చిన్న పిల్లలు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. చెవి ఇన్ఫెక్షన్లకు ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. కొందరిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఆహారపు అలర్జీలు, పోషకాల లోపాలు, కొన్నిసార్లు చెవి లోపల అంతర్గత గాయాలు అయినప్పుడు, వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఈ విధంగా చెవిలో నొప్పి కలిగి ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. ఈ క్రమంలోనే చెవి నుంచి ద్రవం బయటకు రావడంతో తీవ్రమైన నొప్పిని కలిగించి ఎంతో బాధిస్తుంటుంది.
కొందరిలో రెండు చెవులలో కూడా ఈ విధమైనటువంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా రెండు చెవులు ఇన్ఫెక్షన్ కావడం వల్ల వినికిడి లోపం, ఇతర తీవ్రమైన సమస్యలను కలుగజేస్తుంది. కనుక చెవి ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడాలి. అందుకు మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగపడతాయి. ఈ క్రమంలోనే ఆయా పదార్థాలను ఉపయోగించి చెవి ఇన్ఫెక్షన్ల నుంచి ఎలా బయట పడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పు ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండే వంటింటి పదార్థం. చెవిలో ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి ఉప్పు ఎంతో ఉపయోగపడుతుంది. ఒక పాన్ మీద తక్కువ మంటలో ఒక కప్పు ఉప్పును ఐదు నిమిషాలు పాటు వేడి చేయాలి. ఈ విధంగా వేడి చేసిన ఉప్పును ఒక ఒక వస్త్రంలోకి పోసి దానిని రబ్బర్ బ్యాండ్ తో గట్టిగా ముడి వేయాలి. వేడిగా ఉన్న ఉప్పును ఏ చెవిలో అయితే ఇన్ఫెక్షన్ ఉంటుందో ఆ చెవి పైభాగంలో ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆ వస్త్రాన్ని ఉంచాలి. ఈ విధంగా చేయటం వల్ల చెవి లోపల ఉన్నటువంటి ద్రవం మొత్తం బయటకు వచ్చి చెవి నొప్పి, వాపు నుంచి పూర్తిగా విముక్తి కలిగిస్తుంది. అయితే ఈ నివారణ పద్ధతిని రోజులో మనకు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చేయడం వల్ల తొందరగా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా చెవి నొప్పి సమస్యతో బాధపడేవారు రెండు వెల్లుల్లి రెబ్బలు, రెండు లవంగాలను తీసుకొని ఒక టేబుల్ టీస్పూన్ నువ్వుల నూనెలో బాగా వేడి చేయాలి. అలా వేడి చేసిన నూనెను వడపోయాలి. ఈ నూనెను ఏ చెవిలో అయితే మనకు నొప్పిగా ఉందో ఆ చెవిలో రెండు చుక్కలు వేసుకోవటం వల్ల తక్షణమే చెవి నొప్పి సమస్య నుంచి విముక్తి కలగడమే కాకుండా ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నాలుగైదు తులసి ఆకులను తీసుకొని దంచి వాటి నుంచి రసం బయటకు తీయాలి. ఈ రసాన్ని చెవిలో వేసుకోవటం వల్ల తొందరగా నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. కొబ్బరినూనెలో తులసి రసాన్ని సమాన భాగంలో కలిపి అందులో కాటన్ బాల్ వేసి ఆ కాటన్ బాల్ తో చెవి లోపల, చెవి అంచు చుట్టూ, చెవి వెనుక మెత్తగా తుడవాలి. ఈ విధంగా చేయటం వల్ల త్వరగా చెవి ఇన్ఫెక్షన్ ను తగ్గించుకోవచ్చు.
ఒక భాగం ఆపిల్ సైడర్ వెనిగర్ ను సమానమైన నీరు లేదా ఆల్కహాల్ తో కలపాలి. ఈ ద్రావణంలో కాటన్ బాల్ వేసి ఆ కాటన్ బాల్ ను బాధిత చెవిలో ఐదు నిమిషాలపాటు పెట్టడం వల్ల తొందరగా చెవి నొప్పి సమస్య నుంచి విముక్తి కల్పిస్తుంది.
కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను తక్కువ మంట వద్ద వేడి చేసి గోరువెచ్చగా ఉండే నూనెను రెండు చుక్కలు బాధిత చెవిలో వేసుకోవటం వల్ల నొప్పి నుంచి త్వరగా విముక్తిని కల్పిస్తుంది. ఆలివ్ ఆయిల్ మన చెవిలో పేరుకుపోయిన మైనాన్ని తొలగించి చెవిని శుభ్రపరుస్తుంది.
తరచూ మెడకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల చెవి ఇన్ఫెక్షన్లు తగ్గే అవకాశాలు ఉంటాయి. నిటారుగా నిలబడి లేదా కూర్చుని ఈ మెడ వ్యాయామాలను చేయవచ్చు. మీ కుడి భుజానికి సమాంతరంగా కుడివైపుకు మెడను తిప్పి ఐదు నుంచి పది సెకన్ల పాటు సమాంతరంగా పట్టుకొని ఉండాలి. తరువాత ఇదే వ్యాయామాన్ని ఎడమవైపు కూడా చేయాలి. ఈ విధంగా తరచు చేస్తుండటం వల్ల చెవి ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి పొందవచ్చు.
చల్లని లేదా వెచ్చని కంప్రెస్ రెండూ చెవిలో ఉన్న నొప్పిని తగ్గించడానికి దోహద పడతాయి. చల్లని లేదా వేడి వస్త్రాన్ని పది నుంచి పదిహేను నిమిషాల పాటు చెవి పైభాగంలో ఉంచుకోవటం వల్ల నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
ముల్లేయిన్ మొక్క పువ్వుల నుంచి తయారైన నూనె చెవి నొప్పి నివారణకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నూనె మనకు బయట దుకాణాల్లో లభ్యమవుతుంది.
కొన్నిసార్లు చెవి నొప్పి రావడానికి గొంతుతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ముందుగా గొంతులో ఏర్పడిన ఇన్ఫెక్షన్ ను తగ్గించుకోవడం వల్ల చెవి నొప్పిని కూడా తగ్గించుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి ఆ నీటిని బాగా పుక్కిలించడం వల్ల చెవి నొప్పి నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు.
పై తెలిపిన చిట్కాలను ఉపయోగించి చెవి నొప్పి, ఇన్ఫెక్షన్ వంటి సమస్యల నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365