ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆలివ్ ఆయిల్‌.. దీన్ని వాడ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

మార్కెట్‌లో మ‌న‌కు ఎన్నో ర‌కాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆలివ్ ఆయిల్ కూడా ఒక‌టి. దీని ధ‌ర ఎక్కువే. అయితే ఇది అందించే ప్ర‌యోజ‌నాల ముందు దాని ధ‌ర మ‌న‌కు చాలా త‌క్కువ‌గా అనిపిస్తుంది. ఆలివ్ ఆయిల్‌ను రోజూ వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆలివ్ ఆయిల్ యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. అందువ‌ల్ల దీన్ని తీసుకుంటే ఆర్థ‌రైటిస్ నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. ఈ ఆయిల్‌తో సంబంధిత ప్ర‌దేశాల్లో మ‌సాజ్ కూడా చేయ‌వ‌చ్చు. దీని వ‌ల్ల కూడా నొప్పులు త‌గ్గుతాయి. 50 ఎంఎల్ ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఓలియోకాంతాల్ ఐబుప్రొఫెన్‌లో ఉండే 10 శాతం మోతాదుకు స‌మానం. అందువ‌ల్ల ఈ ఆయిల్ నొప్పుల‌ను త‌గ్గిస్తుంది.

2. ఆలివ్ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విట‌మిన్లు ఇ, కెలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్‌ల‌లా ప‌నిచేస్తాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉండే ఫ్రీ ర్యాడిక‌ల్స్ నాశ‌నం అవుతాయి. తీవ్ర‌మైన వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి.

3. ఆలివ్ ఆయిల్‌లో పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, ఒమెగా-6, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. అందువ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. క్యాన్స‌ర్లు రాకుండా చూస్తాయి.

4. ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) త‌గ్గుతుంది. దీని వ‌ల్ల ర‌క్త నాళాల్లో ర‌క్తం గ‌డ్డ‌కట్ట‌కుండా ఉంటుంది. ఈ క్ర‌మంలో హైబీపీ త‌గ్గుతుంది. అలాగే హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి.

5. ఆలివ్ ఆయిల్ ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. మెద‌డు చురుగ్గా మారుతుంది. అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది.

6. ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అధిక బ‌రువు పెర‌గ‌కుండా ఉంటారు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఇది ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది.

7. ఆలివ్ ఆయిల్‌ను త‌ర‌చూ చర్మంపై రాస్తూ మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం మృదువుగా మారుతుంది. పొడి చ‌ర్మం ఉన్న‌వారికి ఇది మేలు చేస్తుంది. చ‌ర్మం కాంతివంతంగా మారి చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

8. ఆలివ్ ఆయిల్‌ను శిరోజాల‌కు వాడితే జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. వెంట్రుక‌ల స‌మ‌స్య‌లు ఉండ‌వు. చుండ్రు త‌గ్గుతుంది. కుదుళ్లు దృఢంగా మారుతాయి. జుట్టు వేగంగా పెరుగుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts