Neem Oil : ఇల్లంతా దీన్ని ఒక్కసారి చల్లితే దోమలు పరార్‌.. మళ్లీ రావు..!

Neem Oil : మన ఇంటి చుట్టూ.. పరిసర ప్రాంతాల్లో వేప చెట్లు ఎక్కువగా పెరుగుతుంటాయి. వేప ఆకులతో ఆయుర్వేద పరంగా మనకు అనేక లాభాలు కలుగుతాయి. వేప ఆకుల్లో ఉండే ఔషధ గుణాల వల్ల వాటితో మనకు కలిగే వ్యాధులను తగ్గించుకోవచ్చు.

amazing benefits of Neem Oil

అయితే మనకు వేప నూనె కూడా ఎంతగానో పనిచేస్తుంది. వేప నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అందువల్ల వేప నూనె మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

1. దంతాలు, చిగుళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్న వారు రోజూ దంతాలను తోముకునే బ్రష్‌పై కొద్దిగా వేప నూనె వేసి దంతాలను తోముకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే.. దంతాలు, చిగుళ్ల నొప్పులు తగ్గుతాయి. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.

2. అర లీటర్‌ నీటిలో రెండు టీస్పూన్ల వేప నూనె వేసి బాగా కలిపి ఇంట్లో, ఇంటి పరిసరాల్లో చల్లాలి. దీంతో దోమలు పారిపోతాయి. మళ్లీ రావు.

3. చలికాలంలో చర్మం సహజంగానే పొడిగా మారుతుంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడేందుకు వేప నూనె ఎంతగానో పనిచేస్తుంది. అందుకు గాను ఈ నూనెను శరీరానికి రాసుకుని గంట సేపు అయ్యాక స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పగలకుండా చూసుకోవచ్చు.

4. కీటకాలు, పురుగులు కుట్టిన చోట వేప నూనెను రాస్తే నొప్పి, దురద, మంట తగ్గుతాయి. అలాగే గాయాలు, పుండ్లపై రాస్తుంటే త్వరగా మానుతాయి.

5. శిరోజాలకు ఈ నూనెను బాగా పట్టించి గంట సేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయాలి. దీంతో పేలు, చుండ్రు తగ్గిపోతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.

6. వేపనూనె క్రిమి సంహారిణిగా కూడా పనిచేస్తుంది. వేప నూనె కలిపి నీటిని ఇంట్లో, ఇంటి పరిసరాల్లో పెంచుకునే మొక్కలపై పిచికారీ చేయాలి. దీంతో సూక్ష్మ జీవులు నశిస్తాయి. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

Editor

Recent Posts