Nerve Weakness : న‌రాల బ‌ల‌హీన‌త‌ను త‌గ్గించుకోవాలంటే.. దీన్ని రోజూ ఉద‌యం, సాయంత్రం తీసుకోవాలి..

Nerve Weakness : మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య ఉన్న వారిలో కాళ్లు, చేతులు వ‌ణ‌క‌డం, క‌ళ్ల నుండి నీరు కార‌డం, గుండెద‌డ ఎక్కువ‌గా ఉండ‌డం, బ‌రువులు మోయ‌లేక‌పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా క‌నిసిస్తాయి. ఈ వ్యాధి నుండి బ‌య‌ట ప‌డ‌డానికి ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా నరాల బ‌ల‌హీన‌త స‌మ‌స్యను అరిక‌ట్ట‌లేక బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. కొన్ని ర‌కాల చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

మ‌నిషికి అష్టైశ్వ‌ర్యాలు ఉన్నా ఆరోగ్యం లేక‌పోతే వ్య‌ర్థ‌మే. అందుకే ఎప్పుడూ సంపాద‌న కోసం పాకులాడ‌డ‌మే కాదు ఆరోగ్యాన్ని కూడా జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. మ‌నిషిని పీడించే వ్యాధులు ఎన్ని ఉన్నా ఒక్క న‌రాల బ‌ల‌హీన‌త వ్యాధి ఉన్న వారి బాధ‌లు వ‌ర్ణాతీతం అనే చెప్పాలి. ఎన్ని ర‌కాల మందులు వాడినా న‌రాల బల‌హీన‌త‌ను అరిక‌ట్ట‌లేకపోతున్నారు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేయాలి. చెప్పులు లేకుండా గ‌డ్డిలో న‌డ‌వ‌డం అల‌వాటు చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల న‌రాల్లో క‌ద‌లిక‌లు వ‌చ్చి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డి మంచి ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

amazing home remedy for Nerve Weakness
Nerve Weakness

అలాగే ప్ర‌తిరోజూ సూర్యోద‌య స‌మ‌యంలో వ‌చ్చే ఎండ‌లో ఉండాలి. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. వాల్ నట్స్, పుచ్చ‌కాయ‌, బ‌చ్చ‌లికూర‌, అర‌టి పండు వంటి ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. ఈ ఆహార ప‌దార్థాల‌న్నీ న‌రాల‌ను గ‌ట్టి ప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే ప్ర‌తిరోజూ కొద్ది దూరం న‌డ‌వాలి. పాల‌ల్లో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది క‌నుక త‌ప్ప‌కుండా పాల‌ను తాగాలి. గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగాలి. అలాగే శరీరానికి కూడా మ‌ర్ద‌నా చేసుకుంటూ ఉండాలి. షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారిలో, మ‌ద్యం తాగే వారిలోనూ, శాకాహారుల్లోనూ న‌రాల బ‌ల‌హీన‌త వ్యాధి ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

కొన్ని ర‌కాల జ్వ‌రాల వ‌ల్ల కూడా నరాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య త‌లెత్తుతుంది. అలాంటి స‌మ‌యంలో కొన్ని ర‌కాల ఇన్ జెక్ష‌న్ ల‌ను చేయించుకోవ‌డం, ఫిజియోథెర‌పీ చేయించుకోవ‌డం వంటివి చేయాలి. అంద‌రికీ కూడా ఇవి చేయించుకోవ‌డం కూడా సాధ్యం కాదు. అలాంటి వారు ఈ ఇంటి చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వచ్చు. న‌రాల బ‌ల‌హీన‌త‌ల‌ను త‌గ్గించే ఇంటి చిట్కాల‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందుకోసం మనం న‌ల్ల జీల‌క‌ర్ర‌ను, మెంతుల‌ను, అశ్వ‌గంధ వేరును ఉప‌యోగించాల్పి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో 50 గ్రా.ల జీల‌క‌ర్ర‌ను, 50 గ్రా. మెంతుల‌ను, 50 గ్రా.ల అశ్వ‌గంధ వేరును వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. అలాగే రాత్రి భోజ‌నం చేయ‌డానికి అర‌గంట ముందు తాగాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా 21 రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల న‌రాల బ‌ల‌హీన‌త‌, వంటి నొప్పులు, ఉద‌ర సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. పైన తెలిపిన చిట్కాల‌తో పాటు ఈ ఇంటి చిట్కాను కూడా పాటించ‌డం వ‌ల్ల న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య నుండి త్వ‌రిత‌గ‌తిన ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని వైద్య నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

D

Recent Posts