దీన్ని రోజూ ఇంత తినండి.. రోగాల‌కు అడ్డుక‌ట్ట వేస్తుంది..!!

రోజూ మ‌నం తినే ఆహార ప‌దార్థాల వ‌ల్ల మ‌న శ‌రీరానికి బ‌లం వ‌స్తుంది. పోషకాలు అందుతాయి. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అయితే క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం ఆవ‌శ్య‌కం అయింది. ఈ క్ర‌మంలోనే చాలా మంది త‌మ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు అనేక ప‌దార్థాల‌ను రోజూ తీసుకుంటున్నారు. అయితే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఉసిరికాయ పొడి, తేనెలు అద్భుతంగా ప‌నిచేస్తాయి.

దీన్ని రోజూ ఇంత తినండి.. రోగాల‌కు అడ్డుక‌ట్ట వేస్తుంది..!!

ఉత్తరాఖండ్ ఆయుర్వేద విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా ప‌నిచేస్తున్న‌ డాక్టర్ ఇలా తన్నా రోగ నిరోధ‌క శ‌క్తిని ఎలా పెంచుకోవాలో వివ‌రించారు. అందుకు ఉసిరికాయ పొడి, తేనెలు చాలు. ఆ మిశ్ర‌మాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావ‌ల్సిన ప‌దార్థాలు

  • 1 టీస్పూన్ ఉసిరికాయ పొడి
  • అర టీస్పూన్ తేనె

త‌యారు చేసే విధానం

1 టీస్పూన్ ఉసిరికాయ‌ పౌడర్‌ను అర టీస్పూన్‌ తేనెతో బాగా క‌ల‌పాలి. మిశ్ర‌మాన్ని బాగా క‌లిపాక దాన్ని రోజూ ఉదయం ప‌ర‌గ‌డుపునే తీసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి స‌హ‌జంగా పెరుగుతుంది. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. జీవ‌క్రియ‌లు స‌రిగ్గా జ‌రుగుతాయి. శ‌రీరంలో తెల్ల ర‌క్త క‌ణాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి. ఇవి ఇన్‌ఫెక్ష‌న్ల‌తో పోరాడుతాయి. సైటోకైన్‌లను విడుదల చేయడానికి తేనె ల్యూకోసైట్‌లను ప్రేరేపిస్తుంది. దీంతో దెబ్బతిన్న కణజాలాలు మ‌ర‌మ్మ‌త్తులు అవుతాయి. అలాగే ఈ మిశ్ర‌మంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts