Ayurvedic Remedies For Black Hair : మీ తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే ఆయుర్వేద చిట్కాలు.. రిజ‌ల్ట్ చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Ayurvedic Remedies For Black Hair : మ‌న‌లో చాలా మంది తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. పూర్వం వ‌య‌సుపైబ‌డిన వారిలోనే క‌నిపించే ఈ స‌మ‌స్య నేటి త‌రుణంలో యువ‌తలో కూడా క‌నిపిస్తుంది. మారిన మ‌న జీవ‌న విధానం, వాతావ‌ర‌ణ కాలుష్యం, పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత జుట్టు తెల్ల‌బ‌డుతూ ఉంటుంది. అయితే చాలా మంది తెల్ల‌జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి హెయిర్ డైల‌ను వాడుతూ ఉంటారు. అయితే హెయిన్ డైల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. హెయిర్ డైల‌ను వాడ‌డం వ‌ల్ల జుట్టు మ‌రింత‌గా దెబ్బ‌తింటుంది. క‌నుక మ‌నం జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి స‌హ‌జంగా ల‌భించే ప‌దార్థాల‌ను వాడ‌డం మంచిది.

తెల్ల‌జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కొన్ని ఆయుర్వేద చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా తెల్ల‌జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. అలాగే జుట్టు ఎదుగుద‌ల కూడా చాలా చ‌క్క‌గా ఉంటుంది. తెల్ల‌జుట్టును న‌ల్ల‌గా మార్చే ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుంట‌గ‌లగ‌రాకు…ఇది మ‌నంద‌రికి తెలిసిందే. దీనినే భృంగ‌రాజ్ అని కూడా అంటారు. తెల్ల‌జుట్టును న‌ల్ల‌గా మార్చ‌డంలో గంట‌గ‌ల‌గ‌రాకు నూనె ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆయుర్వేద షాపుల్లో, ఆన్ లైన్ లో గుంట‌గ‌ల‌గ‌రాకు నూనె సుల‌భంగా ల‌భిస్తుంది.ఈ నూనెను గోరు వెచ్చ‌గా చేసి జుట్టు కుదుళ్ల‌ల్లోకి ఇంకేలా బాగా ప‌ట్టించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల తెల్ల‌జుట్టు న‌ల్ల‌గా మారడంతో పాటు ఇత‌ర జుట్టు స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది.

Ayurvedic Remedies For Black Hair use these for good results
Ayurvedic Remedies For Black Hair

అలాగే జుట్టు తెల్ల‌బ‌డ‌కుండా చేయ‌డంలో ఉసిరికాయ మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. తాజా ఉసిరికాయ‌ల‌ను తిన‌డం వల్ల లేదా ఉసిరి నూనెను త‌ర‌చూ జుట్టుకు రాసుకోవ‌డం వ‌ల్ల జుట్టు తెల్ల‌గా మార‌కుండా ఉంటుంది. అలాగే క‌రివేపాకును వాడ‌డం వల్ల కూడా మ‌నం జుట్టు తెల్ల‌గా మార‌కుండా చేసుకోవ‌చ్చు. దీనిలో ఉండే అనేక ర‌కాల పోష‌కాలు జుట్టు తెల్ల‌గా మార‌కుండా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. క‌రివేపాకును ఆహారంలో తీసుకోవ‌డం ద్వారా అలాగే క‌రివేపాకును పేస్ట్ గా చేసి జుట్టుకు ప‌ట్టించ‌డం వ‌ల్ల మ‌నం జుట్టు న‌ల్ల‌గా ఒత్తుగా ఉంటుంది. అలాగే తెల్ల‌జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు అశ్వ‌గంధ పొడిని లేదా టాబ్లెట్ ల‌ను త‌గిన మోతాదులో వాడ‌డం వల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే వైప నూనెను లేదా వేపాకుల పేస్ట్ ను త‌ల‌కు ప‌ట్టించ‌డం వ‌ల్ల కూడా జుట్టు తెల్ల‌గా మార‌కుండా ఉంటుంది.

అలాగే గోరింటాకు పొడిని( హెన్నా పౌడ‌ర్) ను పేస్ట్ లాగా చేసి జుట్టుకు ప‌ట్టిస్తూ ఉండాలి. ఇలా చేయ‌డం వల్ల క్ర‌మంగా తెల్ల‌జుట్టు న‌ల్ల‌గా మార‌కుండా ఉంటుంది. అదే విధంగా కొబ్బ‌రి నూనెను, నిమ్మ‌ర‌సాన్ని స‌మానంగా తీసుకుని జుట్టుకు ప‌ట్టించాలి. ఇలా ప‌ట్టించ‌డం వల్ల జుట్టు తెల్ల‌బ‌డ‌కుండా ఉంటుంది. అలాగే నువ్వుల నూనెను గోరు వెచ్చ‌గా చేసి జుట్టు కుదుళ్ల‌కు ప‌ట్టించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మెల‌నిన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యి తెల్ల‌జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. అదే విధంగా తెల్ల‌జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు త్రిఫ‌లా చూర్ణాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ విధంగా ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల స‌హ‌జ‌సిద్దంగా తెల్ల‌జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. అలాగే ఈ చిట్కాల‌ను వాడ‌డం వల్ల భ‌విష్య‌త్తులో కూడా తెల్ల‌జుట్టు స‌మ‌స్య రాకుండా ఉంటుంది.

Share
D

Recent Posts