Beauty Tips : ముఖంపై నల్లని మచ్చలు ఉన్నాయా..? ఈ చిట్కాలను పాటించండి..!

Beauty Tips : ఎంతో అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ముఖంపై కొన్ని కారణాల వల్ల ఏర్పడే నల్లని మచ్చలు అందవిహీనానికి కారణమవుతాయి. ఈ క్రమంలోనే చాలా మంది ముఖంపై నల్లని మచ్చలు ఏర్పడితే ఏవేవో సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. ఇలా నల్లటి మచ్చలతో బాధపడేవారు కేవలం సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తూ ముఖంపై ఉండే మచ్చలను త్వరగా తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటి అంటే..

Beauty Tips follow these home remedies if you have dark spots on face

1. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండే అలోవేరా (కలబంద) ఆకుల లోపల ఉండే జెల్ (గుజ్జు)ను తీసుకొని ప్రతి రోజూ  10 నిమిషాల పాటు ముఖంపై మర్దనా చేయాలి. తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే తప్పక ఫలితం కనిపిస్తుంది.

2. నిమ్మకాయలలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలను సులభంగా తొలగించుకోవచ్చు. నల్లని మచ్చలు ఉన్న చోట నిమ్మకాయతో ముఖాన్ని బాగా రుద్దాలి. ఈ 10 నిమిషాల పాటు చేయాలి. తరువాత కడిగేయాలి. రోజూ ఇలా చేస్తే నల్లని మచ్చలు తొలగిపోతాయి.

3. ప్రొటీన్లు అధికంగా ఉండే గుడ్డులోని తెల్లసొనను ముఖంపై ఫేస్ ప్యాక్ లా వేసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో మూడు సార్లు చేయడం వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలు మాయమవుతాయి.

4. ముఖ కాంతిని పెంచడంలో టమాటా కీలక పాత్ర పోషిస్తుంది. టమాటాలతో వారానికి రెండుసార్లు నల్లని మచ్చలపై మర్దనా చేయాలి. టమాటాను సగం కట్‌ చేసి ఆ ముక్కకు ఉన్న లోపలి గుజ్జును ముఖంపై నల్లని మచ్చలు ఉన్న చోట రుద్దాలి. 10 నిమిషాల పాటు మర్దనా చేశాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ఈ మచ్చల నుంచి బయట పడవచ్చు.

Share
Editor

Recent Posts