Jaggery Tea : చ‌లికాలంలో బెల్లం టీని రోజూ తాగాలి.. ఈ లాభాలను పొంద‌వ‌చ్చు..!

Jaggery Tea : బెల్లంలో అనేక పోష‌క ప‌దార్థాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందువ‌ల్ల చ‌క్కెర క‌న్నా మ‌న‌కు బెల్ల‌మే ఎంతో ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వైద్యులు చెబుతుంటారు. బెల్లంలో పోష‌కాలు ఉంటాయి క‌నుక అది మ‌న‌కు మేలు చేస్తుంది. అయితే శీతాకాలంలో బెల్లంతో త‌యారు చేసే టీని రోజూ తాగ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

drink Jaggery Tea in this season for these amazing health benefits

1. బెల్లంలో అనేక పోష‌కాలు ఉంటాయి. దీని వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూసుకోవ‌చ్చు.

2. ఈ సీజ‌న్‌లో ద‌గ్గు, జ‌లుబు స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. వీటిని నివారించేందుకు రోజూ బెల్లం టీని తాగాలి. బెల్లం టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల సీజ‌నల్‌గా వ‌చ్చే వ్యాధులు త‌గ్గుతాయి.

3. ఈ సీజ‌న్‌లో స‌హ‌జంగానే చ‌లి ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక బెల్లం టీని తాగితే చ‌లి తీవ్ర‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. శ‌రీరం వెచ్చ‌గా ఉంటుంది.

4. అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారు రోజూ బెల్లం టీని తాగాలి. దీంతో బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది.

5. చ‌లికాలంలో జీర్ణ‌క్రియ నెమ్మ‌దిగా ఉంటుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వ‌దు. కానీ బెల్లం టీని రోజూ తాగితే జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

6. ఆయుర్వేదం చెబుతున్న ప్ర‌కారం రోజూ బెల్లం టీని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం శుద్ధి అవుతుంది. ర‌క్తంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి.

బెల్లం టీని ఇలా త‌యారు చేయండి..

ల‌వంగాలు, యాల‌కులు, దాల్చిన చెక్క‌, న‌ల్ల మిరియాలను కొద్ది కొద్దిగా స‌మాన భాగాల్లో తీసుకోవాలి. అనంత‌రం వాటిని పెనంపై కొద్దిగా వేయించాలి. త‌రువాత పొడి చేయాలి. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి మ‌రిగించాలి. అందులోనే కొద్దిగా బెల్లం పొడి కూడా వేయాలి. 10 నిమిషాల పాటు స‌న్న‌ని మంట‌పై మ‌రిగించాక‌.. స్ట‌వ్ ఆర్పి దించుకోవాలి. అనంత‌రం వ‌చ్చే టీని వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి. ఈ టీని రోజూ తాగ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి.

Share
Admin

Recent Posts