అందానికి చిట్కాలు

చర్మ సౌంద‌ర్యాన్ని పెంచే చామంతి.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

చామంతులలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఏజింగ్‌, మాయిశ్చరైజర్‌, క్లెన్సింగ్‌ గుణాలు ఉంటాయి. ఇవన్నీ ముఖానికి చక్కని అందాన్నిస్తాయి. ఆ ప్రయోజనాలు మీకు పూర్తిగా అందాలంటే ఇలా చేయాలి.

beauty tips using chamanthi flower

 

1. ఒక కప్పు నీళ్లని కొన్ని నిమిషాల పాటు మరిగించి నాలుగు చెంచాల ఎండిన చామంతుల పొడి కలపాలి. పది నిమిషాల తరువాత కిందకి దించి చల్లారాక వడకట్టి చెంచా తేనె, కొన్ని చుక్కల రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానిఇక పూతలా వేయాలి. పది నిమిషాల తరువాత గోరు వెచ్చని నీళ్లతో కడిగేయాలి.

2. చామంతులు కలిపిన నీళ్లతో ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ముఖ కండరాలు రిలాక్స్ అవుతాయి. మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకుంటాయి. ముఖం మృదువుగా మారుతుంది. అందుకోసం నాలుగు కప్పుల నీళ్లను బాగా మరిగించాలి. పావు కప్పు ఎండు చామంతుల పొడి వేసి ఆవిరి పట్టాలి.

3. చామంతి, తేనెల మిశ్రమం ముఖానికి తెలుపు దనాన్ని తీసుకొస్తుంది. చెంచా చొప్పున ఎండిన చామంతుల పొడి, తేనె కలిపి ముఖానికి పట్టించాలి. పది నిమిషాలయ్యాక గోరు వెచ్చని నీళ్లతో కడిగేస్తే ఫలితం ఉంటుంది. గుప్పెడు చామంతి ఆకుల్ని ఐదు చెంచాల నీళ్లలో మరిగించి చెంచా చొప్పున తేనె, పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసి పావు గంట తరువాత నీళ్లతో కడిగితే చక్కని మెరుపొస్తుంది.

4. ఒక పెద్ద గిన్నెలో సగానికి పైగా నీళ్లు పోసి అందులో గుప్పెడు చామంతి పువ్వుల రెక్కలు, చెండా ఎప్సమ్‌ లవణం, రెండు చెంచా తేనె, కొన్ని చుక్కల రోజ్‌ వాటర్‌ కలిపి పది నిమిషాల పాటు మరిగించాలి. చల్లారి గోరు వెచ్చగా అయ్యాక కాళ్లను అందులో ఇరవై నిమిషాల పాటు ఉంచాలి. ఇది మృతకణాలను తొలగిస్తుంది. పాదాలను మృదువుగా మారుస్తుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts