Beetroot Face Pack : బయట ఎక్కువగా తిరగడం, వాతావరణ కాలుష్యం వంటి వివిధ కారణాల చేత ముఖం అందవిహీనంగా తయారవుతుంది. చర్మంపై దుమ్ము, ధూళి పేరుకుపోయి ముఖం కాంతిహీనంగా మారుతుంది. కాంతివిహీనంగా మారిన మన ముఖాన్ని ఒక చిన్న చిట్కాను ఉపయోగించి అందంగా, తెల్లగా, ప్రకాశవంతంగా, మృదువుగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం అలాగే తయారు చేయడం చాలా తేలిక. దీనిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. మన ముఖాన్ని అందంగా మార్చే ఆ చిట్కా ఏమిటి.. దీనిని ఎలా వాడాలి.. ఎలా తయారు చేసుకోవాలి..అన్న తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ఒక టీ స్పూన్ బీట్ రూట్ జ్యూస్ ను ఒక గిన్నెలో తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ కలబంద జెల్ ను, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక విటమిన్ ఇ క్యాప్సుల్ ను వేసి కలపాలి. తరువాత ఇవి అన్నీ కలిసేలా బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మనం ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ కూడా చేసుకోవచ్చు. ముఖాన్ని అందంగా మార్చడంలో ఈ మిశ్రమం చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకోవాలి.
ఉదయాన్నే నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు, నలుపుదనం తొలగిపోయి ముఖం అందంగా తయారవుతుంది. దీనిని వాడడం వల్ల ఎండ వల్ల నల్లగా మారిన చర్మం తెల్లగా మారుతుంది. ముఖం చక్కటి రంగును సొంతం చేసుకుంటుంది. అంతేకాకుండా చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మనం మన ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు.