Crystal Clear Skin : దీన్ని రాస్తే చాలు.. క్రిస్ట‌ల్ క్లియ‌ర్ అయిన చ‌ర్మం మీ సొంత‌మ‌వుతుంది..!

Crystal Clear Skin : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక చ‌క్క‌టి ఫేస్ ప్యాక్ ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల ముఖం అందంగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను త‌యారు చేయ‌డం అలాగే వాడ‌డం కూడా చాలా సుల‌భం. దీనిని వాడ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, న‌లుపు, ట్యాన్ తొల‌గిపోయి ముఖం అందంగా మారుతుంది. మ‌న ముఖాన్ని అందంగా మార్చే ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అలాగే ఈ చిట్కాను ఎలా వాడాలి.అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ను, రెండు చిటికెల వంట‌సోడాను, ఎగ్ వైట్ ను, ఒక టీ స్పూన్ తేనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో వంట‌సోడా, ఎగ్ వైట్ వేసి క‌ల‌పాలి. చివ‌ర‌గా తేనెను వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న ఫేస్ ప్యాక్ ను ముఖానికి రాసుకుని మ‌ర్ద‌నా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మం ఆరిన త‌రువాత మ‌రోసారి ఈ మిశ్ర‌మాన్ని రాసుకోవాలి. ఇలా రెండు సార్లు రాసుకున్న త‌రువాత పూర్తిగా ఆరే వ‌ర‌కు ఉంచి ఆ త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

Crystal Clear Skin apply this face pack for better effect
Crystal Clear Skin

ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల క‌ళ్ల ఉండే ముడ‌త‌లు తొల‌గిపోతాయి. చ‌ర్మంపై ఉండే ఫైన్ లైన్స్ తొల‌గిపోతాయి. చ‌ర్మం బిగుతుగా త‌యార‌వుతుంది. ముఖంపై ఉండే న‌లుపు, ట్యాన్ తొల‌గిపోయి చ‌ర్మం అందంగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది. చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల చ‌క్క‌టి అందాన్ని సొంతం చేసుకోవ‌చ్చు.

D

Recent Posts