Ginger Lemon Butter Milk : శ‌రీరంలోని వేడిని మొత్తం త‌గ్గించే జింజ‌ర్ లెమ‌న్ బ‌ట‌ర్ మిల్క్‌.. ఇలా చేయాలి..!

Ginger Lemon Butter Milk : బ‌ట‌ర్ మిల్క్.. పెరుగుతో చేసుకోద‌గిన ప‌దార్థాల‌లో ఇది ఒక‌టి. బ‌ట‌ర్ మిల్క్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ‌ట‌ర్ మిల్క్ ను ఎక్కువ‌గా ఎండాకాలంలో త‌యారు చేసుకుని తాగుతూ ఉంటారు. ఎండ‌లో తిరిగివ‌చ్చిన‌ప్పుడు బ‌ట‌ర్ మిల్క్ ను తాగ‌డం వ‌ల్ల ఎండ శ‌రీరం కోల్పోయిన ఎల‌క్రోలైట్స్ ను తిరిగి పొంద‌వ‌చ్చు. మ‌నం ర‌క‌ర‌కాల రుచుల్లో ఈ బ‌ట‌ర్ మిల్క్ ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో జింజ‌ర్ లెమ‌న్ బ‌ట‌ర్ మిల్క్ కూడా ఒక‌టి. దీనిని కేవ‌లం 5 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ బ‌ట‌ర్ మిల్క్ చ‌ల్ల చ‌ల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జింజ‌ర్ లెమ‌న్ బ‌ట‌ర్ మిల్క్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జింజ‌ర్ లెమ‌న్ బ‌టర్ మిల్క్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెరుగు – అర లీట‌ర్, అల్లం త‌రుగు – ఒక టేబుల్ స్పూన్, నిమ్మ‌కాయ‌లు – 2, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Ginger Lemon Butter Milk recipe in telugu very healthy
Ginger Lemon Butter Milk

జింజ‌ర్ లెమ‌న్ బ‌ట‌ర్ మిల్క్ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో పెరుగు, అల్లం తరుగు వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ పెరుగును గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక లీట‌ర్ చ‌ల్ల‌టి నీటిని , త‌రిగిన క‌రివేపాకు, నిమ్మ‌ర‌సం, ఉప్పు వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జింజ‌ర్ లెమ‌న్ బ‌ట‌ర్ మిల్క్ త‌యార‌వుతుంది. దీనిని చ‌ల్ల చ‌ల్ల‌గా స‌ర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ బ‌ట‌ర్ మిల్క్ ను తాగ‌డం వ‌ల్ల మ‌నం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ బ‌ట‌ర్ మిల్క్ ను తాగ‌డం వ‌ల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. వేస‌వి కాలంలో ఈ విధంగా బ‌ట‌ర్ మిల్క్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల శ‌రీరం డీ హైడ్రేషన్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది.

D

Recent Posts