Flaxseeds Gel : రోజూ రాత్రి నిద్ర‌కు ముందు దీన్ని రాస్తే.. ముఖంపై ఎలాంటి మొటిమ‌లు, మ‌చ్చ‌లు, న‌లుపుద‌నం ఉండ‌వు..

Flaxseeds Gel : అవిసె గింజ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. ఈ అవిసె గింజ‌ల‌ను మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇవి అంత‌గా చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండ‌వు. కానీ మ‌న ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యానికే కాదు అందాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా ఈ అవిసె గింజ‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. అవిసె గింజ‌ల‌ను ఒక ర‌క‌మైన సూప‌ర్ ఫుడ్ గా చెప్పుకోవ‌చ్చు. వీటిలో మ‌న శ‌రీరానికి మేలు చేసే కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబ‌ర్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఈ అవిసె గింజ‌ల‌ను మ‌న అందాన్ని మెరుగుప‌రుచుకోవ‌డం కోసం ఎలా ఉప‌యోగించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న ముఖ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో అవిసె గింజ‌లు మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. వీటితో జెల్ ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల ముఖం అందంగా కాంతివంతంగా త‌యార‌వుతుంది.

దీని కోసం ముందుగా మ‌నం ఒక చిన్న గిన్నె అవిసె గింజ‌ల‌ను తీసుకోవాలి. త‌రువాత ఒక క‌ప్పు నీటిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అవిసె గింజ‌ల‌ను వేసి 10 నిమిషాల పాటు మ‌రిగించాలి. ఇలా మ‌రిగించ‌డం వ‌ల్ల 10 నిమిషాల త‌రువాత నీళ్లు కోడిగుడ్డు తెల్ల‌సొన మాదిరి తెల్ల‌గా జెల్ లాగా మారుతాయి. ఇలా జెల్ లాగా మారిన వెంట‌నే స్ట‌వ్ ఆఫ్ చేయాలి. త‌రువాత ప‌ది నిమిషాల పాటు అలాగే క‌దిలించ‌కుండా అలాగే ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కాటన్ వ‌స్త్రాన్ని వేసి అందులో ఇలా ఉడికించిన అవిసె గింజ‌ల‌ను వేసి చేత్తో గ‌ట్టిగా పిండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఈ జెల్ లో గింజ‌ల నుండి సుల‌భంగా వేర‌వుతుంది. ఇలా త‌యారు చేసుకున్న జెల్ ను ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకుని ఒక నెల వ‌రకు ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇలా త‌యారు చేసుకున్న అవిసె గింజ‌ల జెల్ ను రోజూ రాత్రి ప‌డుకునే ముందు ముఖానికి రాసుకుని ఉద‌యాన్నే చ‌ల్ల‌టి నీటితో శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం ఆరోగ్య‌వంతంగా త‌యార‌వుతుంది.

Flaxseeds Gel use it in this way for facial problems
Flaxseeds Gel

ముఖం కాందివంతంగా త‌యారవుతుంది. ఈ జెల్ లో తేనెను క‌లిపి రాసుకోవ‌డం వ‌ల్ల ముఖం పై ఉండే ముడ‌త‌లు తొల‌గిపోతాయి. అంతేకాకుండా ముఖం పై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు, న‌లుపుద‌నం వంటి వాటిని కూడా ఈ జెల్ తొల‌గిస్తుంది. ఈ జెల్ ను ఎటువంటి చ‌ర్మ‌తత్వం ఉన్న వారైనా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. అలాగే ఇత‌ర ఫేస్ ప్యాక్ ల‌ల్లో కూడా ఈ జెల్ ను వేసి ముఖానికి రాసుకోవ‌చ్చు. అలాగే ఈ జెల్ ను తీయ‌గా మిగిలిన అవిసె గింజ‌ల‌ను పేస్ట్ గా చేసి హెయిర్ ప్యాక్ గా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ విధంగా అవిసె గింజ‌ల‌తో చేసిన జెల్ ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ముఖ సౌంద‌ర్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts