Hair Fall : దీన్ని వాడితే.. జుట్టు అస‌లు రాల‌దు.. దృఢంగా పెరుగుతుంది..!

Hair Fall : స్త్రీలు అందంగా ఉండ‌డానికి ఎప్పుడూ ఫ్రాధాన్య‌తను ఇస్తూనే ఉంటారు. అదే విధంగా జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డానికి వారు ఎంతో క‌ష్ట‌ప‌డుతూ ఉంటారు. జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, పొడుగ్గా ఉండ‌డానికి వారు చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌నే ఉండ‌దు. స‌హ‌జ సిద్ద‌మైన ప‌ద్ద‌తిలో ఇంటి చిట్కాను ఉప‌యోగించి మ‌నం జుట్టును న‌ల్ల‌గా, ఒత్తుగా చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను పాటించ‌డం వల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చిట్కా జుట్టుకు సంజీవ‌ని వంటిది. అస‌లు ఈ చిట్కా ఏమిటి.. ఈ చిట్కాను ఎలా ఉప‌యోగించాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిట్కా కోసం ముందుగా మ‌నం వంట‌ల్లో ఉప‌యోగించే క‌రివేపాకును తీసుకోవాలి. క‌రివేపాకుకు మ‌న కంటి చూపును పెంచే శ‌క్తితోపాటు మ‌న జుట్టును న‌ల్ల‌గా, ఒత్తుగా చేసే శ‌క్తి కూడా ఉంది. క‌రివేపాకుతోపాటు మనం గుంట‌గ‌ల‌గ‌రాకును కూడా మ‌న‌కు కావ‌ల్సిన ప‌రిమాణంలో తీసుకుని శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న ఆకుల‌ను ఒక జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిశ్ర‌మానికి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పుల్ల‌ని పెరుగును క‌లపాలి. ఇప్పుడు చిక్కులు లేకుండా జుట్టును దువ్వి ఆ త‌రువాత ముందుగా పెరుగు క‌లిపి పెట్టుకున్న మిశ్ర‌మాన్ని తీసుకుని కుదుళ్ల నుండి జుట్టు చివ‌ర్ల వ‌ర‌కు బాగా ప‌ట్టించాలి.

follow this wonderful home remedy to control Hair Fall
Hair Fall

ఇలా ప‌ట్టించిన ఒక గంట త‌ర్వాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తుండ‌డం వ‌ల్ల జుట్టు స‌మ‌స్యలు త‌గ్గుతాయి. జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, మెరుస్తూ ఉంటుంది. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల స‌హ‌జ సిద్దంగా ఎటువంటి దుష్ప‌భ్రావాలు లేకుండా మ‌నం మ‌న జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఈ విధంగా మ‌నం క‌రివేపాకును, గుంట‌గ‌ల‌గ‌రాకును ఉప‌యోగించి జుట్టును పొడుగ్గా పెరిగేలా చేసుకోవ‌డ‌మే కాకుండా జుట్టును ఆరోగ్యంగా కూడా ఉంచుకోవ‌చ్చు.

Share
D

Recent Posts