Cardamom : మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. ఈ భూమి మీద సమస్యలు లేనివారు ఉండనే ఉండరు. ఈ సమస్యల నుండి బయటపడడానికి మనం నిత్యం దేవున్ని ప్రార్థిస్తూనే ఉంటాం. అయితే మనం వంటింట్లో ఉపయోగించే మసాలా దినుసు అయిన యాలకులను ఉపయోగించి మనం మనకు వచ్చే సమస్యల నుండి బయటపడవచ్చు. అంతే కాకుండా కింద చెప్పిన విధంగా యాలకులతో చేయడం వల్ల ధనం ప్రాప్తి కూడా కలుగుతుందట. యాలకులను ఉపయోగించి సమస్యల నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కేవలం 5 ఆకుపచ్చగా, తాజాగా ఉండే యాలకులను ఉపయోగించి మనం మన సమస్యల నుండి బయటపడవచ్చు. మనం ఫలానా రోజున అనుకున్న పని చేస్తే కలిసి వస్తుంది.. అని అనుకుంటూ ఉంటాం. అలాంటి రోజున మొదటగా మన ఇంటిని, ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. అలాగే దేవుడి పటాలను లేదా ప్రతిమలను శుభ్రం చేసి దీపారాధన చేయాలి. ఇష్ట దైవానికి నైవేద్యాన్ని సమర్పించి పూజ మొతాన్ని పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు 5 ఆకుపచ్చ యాలకులను తీసుకుని ఒక్కో యాలక్కాయను విప్పుతూ మనకు ఉండే సమస్యలను చెప్పుకోవాలి. ఇలా 5 యాలకులను విప్పుతూ మనకు ఉండే సమస్యలను మనసులో అనుకుని యాలకులను ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఉంచాలి.
అదే విధంగా ఆ వస్త్రంలో పసుపు, కుంకుమ, బియ్యంతోపాటు 2 లేదా 5 రూపాయల నాణాన్ని, పసుపు రంగు పువ్వును ఉంచి ఒక మూటలా కట్టాలి. ఇప్పుడు సంచికి ఉండే కాడల వలే ఈ మూటకు కూడా ఎరుపు రంగు దారంతో కాడలను కట్టి దీనిని కూడా సంచిలా తయారు చేసుకోవాలి. ఈ మూటకు కూడా ధూప దీప నైవేద్యాలను సమర్పించి ఆ మూటను దేవుడి సన్నిధిలోనే ఉంచాలి. సూర్యాస్తమయం సమయంలో ఆ మూటను తీసి ఇంట్లో ఎవరూ తిరగని ఒక మూలన రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసి, ఇంటిని కూడా శుభ్రపరుచుకుని ఆ మూటను తీసి మరలా దైవ సన్నిధిలో పావు గంట పాటు ఉంచి ఆ మూటను పారుతున్న నీటిలో లేదా నదిలో వదిలి చేత్తో మూడు సార్లు ముందుకు అనాలి.
ఇలా నీటి సదుపాయం లేని వారు దగ్గర్లో ఉండే గుడికి వెళ్లి రావి చెట్టు లేదా మారేడు చెట్టు మొదట్లో ఆ మూటను విప్పి ఉంచాలి. ఇలా మూటను నీటిలో వదిలేటప్పుడు లేదా చెట్టు మొదట్లో విప్పేటప్పుడు మనం ఎందుకోసమైతే ఆ మూటను కట్టామో ఆ కోరికను పదే పదే మనసులో అనుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మన సమస్యలు తగ్గడమే కాకుండా ధనప్రాప్తి కూడా కలుగుతుందని పండితులు చెబుతున్నారు.