Hair Oiling : జుట్టుకు ఈ విధంగా నూనె రాస్తే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?

Hair Oiling : ప్రతి ఒక్కరూ తమకు పొడవైన, ఒత్తైన జుట్టు ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే జుట్టు పెరుగుదల కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే జుట్టుకు సరైన పోషణ అందాలంటే తప్పనిసరిగా మనం నూనె రాయాల్సి ఉంటుంది.

Hair Oiling should be done in this way for healthy hair Hair Oiling should be done in this way for healthy hair

నూనె జుట్టుకు మంచి మాయిశ్చరైజర్ గా ఉండడంతోపాటు జుట్టుకు తగినంత బలాన్ని కలిగిస్తుంది. ఇలా నూనెను అధిక మొత్తంలో తల మాడుకు అంటుకునే విధంగా రాయడం వల్ల జుట్టు మరింత బలంగా తయారవుతుంది. ఈ క్రమంలోనే జుట్టు రాలడానికి ఆస్కారం ఉండదు.

పలు పరిశోధనల అనంతరం మన శరీరానికి నూనె ఏ విధంగా అవసరమో జుట్టుకు కూడా అంతే అవసరమని నిపుణులు వెల్లడించారు. ఈ క్రమంలోనే తలకు బాగా నూనెను రాసి మర్దనా చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ జరిగి జుట్టుకు తగిన బలాన్ని ఇస్తుంది. అలాగే జుట్టుకు నూనె రాసేటప్పుడు కాస్త గోరువెచ్చని నూనెను రాయడం ఎంతో మంచిది.

ఒకవేళ మామూలు నూనె పట్టించినప్పటికీ తలకు నూనె రాసిన తర్వాత కాస్త ఆవిరిపట్టి అనంతరం మన జుట్టుకు కండిషనర్ తో తలంటుస్నానం చేయాలి. తలకు నూనె పెట్టిన రెండు మూడు రోజుల తర్వాత తలస్నానం చేయకూడదు.

స్నానానికి రెండు గంటల ముందు నూనె రాయడం లేదా రాత్రి నూనె రాసి పొద్దున్నే తలకి స్నానం చేయాలి. ఇలా నూనె రాసి తలస్నానం చేయకపోవడంతో అధిక దుమ్ము, ధూళి తలలో పేరుకొని జుట్టును మరింత బలహీనంగా చేసి జుట్టు రాలడానికి కారణం అవుతుంది. కనుక నూనె రాసిన తరువాత కొంత సమయం ఆగి తలస్నానం చేస్తే మంచిది. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Sailaja N

Recent Posts