Dry Fruits Laddu : ఆరోగ్యానికి మహా ప్రసాదం.. డ్రైఫ్రూట్స్ లడ్డూలు..!

Dry Fruits Laddu : మనం ఎంతో కష్టపడి ఎన్నో పనులు చేస్తూ డబ్బులు పోగు చేసేది కేవలం మనం ఆరోగ్యంగా ఉండటం కోసమే. ఈ క్రమంలోనే ఆరోగ్యంగా ఉండటం కోసం ఎన్నో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తయారు చేసుకొని తింటాము. ఇలా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలలో డ్రైఫ్రూట్స్ లడ్డు ఒకటి అని చెప్పవచ్చు. వివిధ రకాల డ్రైఫ్రూట్స్ తో తయారు చేసుకున్న ఈ లడ్డూలను తినడం వల్ల ఎన్నో రకాల పోషకాలు అంది మనం ఆరోగ్యవంతంగా ఉంటాము. అయితే డ్రైఫ్రూట్స్ లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Dry Fruits Laddu most healthy and nutritional for our health Dry Fruits Laddu most healthy and nutritional for our health

కావలసిన పదార్థాలు

* ఖర్జూరం – అర కిలో

* బెల్లం 150 గ్రా.

* పంచదార 100 గ్రా.

* నెయ్యి అర పావు

* గసగసాలు – 50 గ్రా.

* ఎండుకొబ్బరి – 50 గ్రా.

* పిస్తాపప్పు – 100 గ్రా.

* అంజీర్‌ పప్పు – 100 గ్రా.

* జీడిపప్పు – అర కేజీ.

* సారపప్పు – 100 గ్రా.

* యాలకుల పొడి – 10 గ్రా.

* బాదంపప్పు  – 100 గ్రా.

తయారీ విధానం

డ్రై ఫ్రూట్స్ లడ్డూలను తయారు చేయడానికి ముందుగా ఖర్జూర పండ్లలోని విత్తనాల అన్నింటినీ తీసి వాటిని పొడవాటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటితోపాటు పిస్తా, బాదంపప్పు, సారపప్పును కూడా పొడవుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అంజీరాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

స్టవ్ పై ఒక గిన్నెలో అర లీటర్ నీటిని వేసి చక్కెర బెల్లం వేసి చిన్న మంటపై తీగపాకం వచ్చేలా తయారు చేసుకోవాలి. అలాగే మరొక స్టవ్ పై కడాయి ఉంచి కొద్దిగా నెయ్యి వేసి ముందుగా కట్ చేసి పెట్టుకొన్న డ్రైఫ్రూట్స్ అన్నింటినీ దోరగా వేయించుకోవాలి. ఇందులో యాలకులపొడి, గసగసాల పొడి వేసి నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తీగ పాకం వచ్చిన తరువాత వేయించుకున్న డ్రైఫ్రూట్స్ అందులో వేసి బాగా కలియబెట్టి కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూల మాదిరిగా చేసుకుంటే ఎంతో రుచికరమైన డ్రైఫ్రూట్స్ లడ్డూలు తయారైనట్లే.

Sailaja N

Recent Posts