క‌నురెప్ప‌ల మీద వెంట్రుక‌లు ద‌ట్టంగా, ఆక‌ర్ష‌ణీయంగా పెర‌గాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

క‌నురెప్ప‌ల మీద వెంట్రుక‌లు పొడ‌వుగా, వంకీలు తిరిగి అందంగా క‌నిపించాల‌ని చాలా మంది కోరుకుంటుంటారు. ముఖ్యంగా మ‌హిళ‌లు అందుకోసం ఎక్కువ‌గా ప్ర‌య‌త్నిస్తుంటారు. సాధార‌ణంగా సెల‌బ్రిటీలు ఆ విధంగా క‌నురెప్ప‌ల వెంట్రుక‌లు ఉండేందుకు అనేక మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే క‌నురెప్ప‌ల వెంట్రుక‌ల‌ను ద‌ట్టంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించేలా చేయ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే..

home remedies for beautiful eye lashes

* షియా బ‌ట‌ర్ మ‌న‌కు మార్కెట్‌లో ల‌భిస్తుంది. ఇందులో విట‌మిన్లు ఎ, ఇ లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి క‌నురెప్ప‌ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అక్క‌డి వెంట్రుక‌ల‌ను ద‌ట్టంగా పెరిగేలా చేస్తాయి. షియా బ‌ట‌ర్‌ను కొద్దిగా తీసుకుని దాన్ని క‌నురెప్ప‌ల‌పై రోజూ సున్నితంగా మ‌ర్ద‌నా చేస్తుండాలి. దీంతో క‌నురెప్ప‌లపై ఉండే వెంట్రుక‌లు పెరుగుతాయి. ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి.

* ఆముదంలో స‌హ‌జ‌సిద్ధ‌మైన ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి క‌నురెప్ప‌ల‌పై వెంట్రుక‌ల‌ను ద‌ట్టంగా, పొడ‌వుగా పెరిగేలా చేస్తాయి. ఆముదం నూనెను రాత్రి పూట క‌నురెప్ప‌ల‌పై మ‌ర్ద‌నా చేయాలి. ఉద‌యాన్నే క‌డిగేయాలి. ఇలా రోజూ చేస్తే ఫ‌లితం ఉంటుంది.

* కొబ్బ‌రినూనె, బాదంనూనె, ఆలివ్‌నూనెల‌ను తీసుకుని అన్నింటినీ క‌ల‌పాలి. ఈ నూనెల్లో ఉండే ప్రోటీన్లు, మిన‌ర‌ల్స్ క‌నురెప్ప‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ నూనెల‌ను క‌లిపి మిశ్ర‌మంగా చేసి దాన్ని క‌నురెప్ప‌ల‌పై రాస్తుండాలి. నూనెను రాశాక 3-4 గంట‌లు ఆగి క‌డిగేయాలి. రోజూ ఇలా చేస్తుంటే క‌నురెప్ప‌లు ఆరోగ్యంగా మారుతాయి. క‌నురెప్ప‌ల‌పై ఉండే వెంట్రుక‌లు బాగా పెరుగుతాయి.

* నిమ్మ‌ర‌సం చుక్క‌లు, ఆలివ్ ఆయిల్ ను తీసుకుని క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని క‌నురెప్ప‌ల‌పై రాయాలి. రాత్రి పూట రాసి ఉద‌యం క‌డిగేయాలి. త‌ప్ప‌క ఫ‌లితం ఉంటుంది.

* విట‌మిన్ ఇ క్యాప్సూల్స్ మ‌న‌కు బ‌య‌ట ల‌భిస్తాయి. వాటిని కొనుగోలు చేసి ఒక్క క్యాప్సూల్‌ను తీసుకుని దానిపై పిన్‌తో గుచ్చాలి. అందులో ఉండే నూనెను క‌నురెప్ప‌ల‌పై రాయాలి. రోజులో ఇలా ఎప్పుడైనా చేయ‌వ‌చ్చు. ఇలా రాశాక కొంత సేపు ఆగి క‌డిగేయాలి. దీని వ‌ల్ల కూడా క‌నురెప్ప‌ల‌పై ఉండే వెంట్రుక‌లు పెరుగుతాయి. ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి.

Share
Admin

Recent Posts