వ‌క్షోజాల సంర‌క్ష‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డే ఉల్లిపాయ‌ల ర‌సం.. ఎలా త‌యారు చేసుకోవాలంటే..?

ఉల్లిపాయ‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. చ‌ర్మం, వెంట్రుక‌ల‌కు ఉల్లిపాయ‌లు ఎంత‌గానో మేలు చేస్తాయి. ఉల్లిపాయ‌ల జ్యూస్ వ‌ల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. చుండ్రు త‌గ్గుతుంది. జుట్టు తెల్ల‌బ‌డ‌కుండా ఉంటుంది. ఉల్లిపాయ‌ల్లో ఉండే పోష‌కాలు చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. అయితే ఉల్లిపాయ‌లు వక్షోజాల సంర‌క్ష‌ణ‌కు కూడా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దీంతో వ‌క్షోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.

here it is how to prepare onion juice that cares breasts

కింద ఇచ్చిన సుల‌భ‌మైన విధానాల్లో ఉల్లిపాయ‌ల జ్యూస్‌ను మీరు ఇంట్లోనే త‌యారు చేసుకుని ఉప‌యోగించ‌వ‌చ్చు.

స్టెప్ 1: ఒక పెద్ద ఉల్లిపాయ‌ను తీసుకోవాలి. దాని పొట్టు తీసి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

స్టెప్ 2: ఉల్లిపాయ ముక్క‌ల‌ను మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి. అనంత‌రం ఆ పేస్ట్‌ను బాగా పిండుతూ ర‌సం తీయాలి. ఇందుకు అవ‌స‌రం అయితే శుభ్ర‌మైన వ‌స్త్రాన్ని ఉపయోగించ‌వ‌చ్చు.

స్టెప్ 3: ఒక పాత్ర‌లో ఆ జ్యూస్‌ను సేక‌రించి అందులో 2 టీస్పూన్ల ఆముదాన్ని వేయాలి. త‌రువాత విట‌మిన్ ఎ క్యాప్సూల్‌ను విడ‌దీసి అందులో పోయాలి. త‌రువాత ఆ మిశ్ర‌మాన్ని బాగా క‌ల‌పాలి.

స్టెప్ 4: ఒక పాత్ర‌లో నీటిని పోసి దాన్ని స్ట‌వ్ పై ఉంచి ఆ నీటిని మ‌రిగించాలి. ఆ నీటిలో పైన క‌లిపిన మిశ్ర‌మం ఉన్న పాత్ర‌ను ఉంచాలి. దీంతో పాత్ర నీటిపై తేలుతుంది. నీరు బాగా మ‌రిగేంత వ‌ర‌కు ఆ పాత్ర‌ను నీటిపై అలాగే ఉంచాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేయాలి.

ఇలా త‌యార‌య్యే మిశ్ర‌మాన్ని రోజుకు రెండు సార్లు వ‌క్షోజాల‌కు రాసి సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. మిశ్ర‌మం మిగిలితే దాన్ని నిల్వ చేసి ఫ్రిజ‌ల్ ఉంచి మ‌ళ్లీ ఉప‌యోగించుకోవ‌చ్చు. ఎక్కువ మొత్తంలో దీన్ని ఒకేసారి త‌యారు చేసుకుని ఫ్రిజ్‌లో ఉంచి రోజూ ఉప‌యోగించ‌వ‌చ్చు. మిశ్ర‌మాన్ని రాసిన త‌రువాత 30 నిమిషాల పాటు ఉండి శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే వ‌క్షోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.

Admin

Recent Posts