Mutton Kheema Curry : మ‌ట‌న్ ఖీమా క‌ర్రీ ఇలా చేయండి.. బ‌య‌ట ల‌భించే దానికంటే ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Mutton Kheema Curry : మ‌నం మట‌న్ ఖీమాను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. నాన్ వెజ్ ప్రియుల‌కు దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ ఖీమాతో ఎక్కువ‌గా కర్రీని త‌యారు చేసి తీసుకుంటూ ఉంటారు. ఖీమా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, రోటీ, ప‌రోటా, పూరీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఖీమా క‌ర్రీని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా ఈ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మ‌ట‌న్ ఖీమా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌న్ ఖీమా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు- 1, ల‌వంగాలు – 3, యాల‌కులు – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, మ‌ట‌న్ ఖీమా – అర‌కిలో, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – 3 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర‌- కొద్దిగా, త‌రిగిన పుదీనా – కొద్దిగా, నీళ్లు – ముప్పావు క‌ప్పు.

Mutton Kheema Curry recipe very tasty than restaurant
Mutton Kheema Curry

మ‌ట‌న్ ఖీమా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ప‌సుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ఖీమా వేసి క‌ల‌పాలి. దీనిని 3 నిమిషాల పాటు వేయించిన త‌రువాత కారం, ఉప్పు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, కొత్తిమీర‌, పుదీనా వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మ‌రికొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టాలి. దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ ఖీమా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని చ‌పాతీతో తింటే మ‌రింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా మ‌ట‌న్ ఖీమాతో క‌ర్రీని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts