Pepper Coconut Oil : ఈ రోజుల్లో చాలా చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతోంది. తెల్ల జుట్టు సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, ఆందోళన, విటమిన్ బి 12 లోపం, థైరాయిడ్ వంటి అనారోగ్య సమస్యల కారణంగా జుట్టు తెల్లబడుతోంది. ఈ తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి మార్కెట్ లో దొరికే అనేక రకాల హెయిర్ డై లను, షాంపూలను వాడుతూ ఉంటారు. వీటిని ఉపయోగించడం వల్ల తాత్కాలిక ప్రయోజనమే ఉంటుంది.
అంతేకాకుండా డైలను, షాంపూలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం, తలనొప్పి, కంటి సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే రసాయనాల కారణంగా మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సహజసిద్దంగా కూడా మనం తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను పాటించడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా ఎటువంటి దుష్ర్పభావాలు కూడా ఉండవు. తెల్ల జుట్టును నల్లగా మార్చే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందు కోసం మనం 15 నల్ల మిరియాలను, పావు లీటర్ స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా 15 నల్ల మిరియాలను మెత్తగా నూరాలి. ఈ మిరియాల పొడిని కొబ్బరి నూనెలో పోసి చిన్న మంటపై కొద్దిగా వేడి చేయాలి. ఇలా వేడి చేసిన నూనెను చల్లగా అయిన తరువాత వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రోజూ పడుకునేముందు కుదుళ్ల లోపలికి ఇంకేలా తలకు బాగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల క్రమక్రమంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.