Dandruff : చుండ్రుని శాశ్వతంగా తొలగించే చిట్కాలు..!

Dandruff : సాధార‌ణంగా చుండ్రు స‌మ‌స్య చాలా మందిని బాధిస్తుంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చుండ్రును శాశ్వ‌తంగా వదిలించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే..

remove Dandruff  permanently with these natural home remedies

1. కొద్దిగా వెనిగ‌ర్ తీసుకుని దాన్ని నీళ్ల‌లో క‌లిపి జుట్టుకు ప‌ట్టేలా రాయాలి. 30 నిమిషాల పాటు ఉండి త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల చుండ్రు త‌గ్గుతుంది. ముఖ్యంగా దుర‌ద‌తో కూడిన చుండ్రు స‌మ‌స్య నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. ఈ విధంగా వారంలో క‌నీసం 3 సార్లు చేయాలి.

2. కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని నీటితో క‌లిపి దాన్ని జుట్టుకు ప‌ట్టించాలి. 30 నిమిషాలు ఆగాక త‌ల‌స్నానం చేయాలి. బేకింగ్ సోడాలో యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల బాక్టీరియా న‌శిస్తుంది. శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు త‌గ్గుతుంది.

3. కొన్ని వేపాకుల‌ను తీసుకుని పేస్ట్‌లా చేసి జుట్టుకు ప‌ట్టించాలి. 1 గంట సేపు ఉన్నాక త‌ల‌స్నానం చేయాలి. వేపాకుల్లోనూ యాంటీ ఫంగ‌ల్, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ఉంటాయ‌. దీని వ‌ల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. త‌లంతా శుభ్రంగా మారుతుంది. చుండ్రు పోతుంది.

4. మీరు వాడే సాధార‌ణ షాంపూలో కొన్ని చుక్క‌ల టీ ట్రీ ఆయిల్‌ను క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మంతో త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా త‌ర‌చూ చేస్తుంటే చుండ్రు స‌మ‌స్య నుంచి బ‌యట ప‌డ‌వ‌చ్చు.

5. క‌ల‌బంద గుజ్జును జుట్టుకు బాగా రాసి 1 గంట‌ల సేప‌య్యాక త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు స‌మ‌స్య‌తోపాటు ఇత‌ర శిరోజాల స‌మ‌స్య‌లూ త‌గ్గుతాయి. జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా మార‌డ‌మే కాక బాగా పొడ‌వుగా పెరుగుతుంది.

Share
Admin

Recent Posts