Salt : ఉప్పును ఈ విధంగా వాడండి.. చర్మం, జుట్టు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి..!

Salt : మ‌నం రోజూ మ‌న చ‌ర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవ‌డానికి ర‌క‌ర‌కాల సౌంద‌ర్య సాధ‌నాలను వాడుతూ ఉంటాం. ఇవి ఎక్కువ ఖ‌ర్చుతో కూడిన‌వి. వీటిల్లో ర‌సాయానాల‌ను కూడా అధికంగా వాడ‌తారు. ఈ సౌంద‌ర్య సాధ‌నాలు తాత్క‌లిక‌మైన ఫ‌లితాల‌ను మాత్ర‌మే ఇస్తాయి. అలాగే శ‌రీరాన్ని రోగాల బారిన ప‌డేలా చేస్తాయి. స‌హ‌జ సిద్ద‌మైన ప‌ద్ద‌తిలో, త‌క్కువ ఖ‌ర్చుతో ఇంటిలో ఉప‌యోగించే ఉప్పు ద్వారా చ‌ర్మాన్ని, జుట్టును సంర‌క్షించుకోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

use Salt in these ways to treat hair and skin problems
Salt

ఉప్పును వాడ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే మృత‌క‌ణాలు తొల‌గిపోయి, చ‌ర్మం పొడి బార‌కుండా ఉంటుంది. త‌ల స్నానం చేసేట‌ప్పుడు ఉప్పును వాడ‌డం వ‌ల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు పెరుగుద‌ల‌కు ఉప్పు ఎంత‌గానో సహాయ‌ప‌డుతుంది. చుండ్రు స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుంది.

చ‌ర్మ సౌంద‌ర్యానికి ఉప్పును ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఉప్పును ఫేస్ మాస్క్‌లా కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. సున్నిత‌మైన, పొడి చ‌ర్మం క‌ల‌వారికి ఉప్పు ఎంత‌గానో స‌హాయప‌డుతుంది. 4 టీ స్పూన్ ల తేనెలో 2 టీ స్పూన్‌ల ఉప్పు వేయాలి. ఈ మిశ్ర‌మాన్ని పొడి చ‌ర్మంపై మాస్క్ లా వేసి 15 నిమిషాల త‌రువాత నీటితో క‌డిగేయాలి. ఉప్పు చ‌ర్మం ఎక్కువగా నూనెను స్ర‌వించ‌కుండా చేసి చ‌ర్మంపై తేమ శాతాన్ని కాపాడుతుంది. చ‌ర్మం పొడి బారకుండా ఉంటుంది. ఇలా త‌రచూ చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

2. ఉప్పుని మ‌నం స్క్ర‌బ‌ర్ లా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. కొబ్బ‌రి నూనెలో కొద్దిగా ఉప్పును వేసి ఈ మిశ్ర‌మాన్ని శ‌రీరంపై రుద్ద‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే మృత క‌ణాలు తొలగిపోతాయి.

3. ఉప్పును ఫేస్ టోన‌ర్ లా ఉప‌యోగించ‌డం వ‌ల్ల చ‌ర్మం పొర‌ల్లో ఉండే బ్యాక్టీరియాను చంపి మొటిమ‌లు ఏర్ప‌కుండా చేస్తుంది. ఒక టీ స్పూన్ ఉప్పులో 4 ఎంఎల్ వేడి నీళ్లు పోయాలి. ఈ మిశ్ర‌మాన్ని స్ప్రే బాటిల్ లో పోసి ముఖంపై స్ప్రే చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి.

జుట్టు ఆరోగ్యానికి ఉప్పును ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. జుట్టు పెరుగుద‌ల‌కు ఉప్పు ఎంత‌గానో స‌హాయప‌డుతుంది. త‌ల స్నానం చేసేట‌ప్పుడు త‌ల‌కు 15 నిమిషాల పాటు ఉప్పుతో మ‌సాజ్ చేసి త‌రువాత నీటితో క‌డిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

2. మ‌న చ‌ర్మంపై ఉండే సెబాషియ‌స్ గ్రంథులు నూనెను అధికంగా స్ర‌వించ‌డం వ‌ల్ల త‌ల ఎప్పుడూ జిడ్డుగా ఉంటుంది. ఈ స‌మస్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మ‌నం వాడే షాంపులో మూడు చెంచాల ఉప్పు వేసి త‌ల‌స్నానం చేయాలి. ఇలా త‌రచూ చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం నుండి నూనె అధికంగా ఉత్ప‌త్తి అవ్వ‌దు. జుట్టు నిగారిస్తుంది.

3. చుండ్రు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఉప్పును వాడ‌డం వ‌ల్ల ఈ స‌మస్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. జుట్టును రెండు భాగాలుగా చేసి త‌ల‌ను 10 నిమిషాల పాటు ఉప్పుతో బాగా రుద్దాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల త‌ల చ‌ర్మానికి ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంది. చుండ్రు స‌మ‌స్య త‌గ్గుతుంది.

ఉప్పుతో ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. శ‌రీరానికి ఎటువంటి హాని క‌ల‌గ‌దు.

D

Recent Posts