Belly Fat Drink : వీటిని తాగితే చాలు.. ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా స‌రే త‌గ్గిపోతుంది..!

Belly Fat Drink : అధిక బ‌రువు.. ఈ స‌మ‌స్య కార‌ణంగా మ‌న‌లో చాలా మంది ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. శ‌రీరం బ‌రువు పెర‌గ‌డంతో పాటు వివిధ శ‌రీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి అనేక అనారోగ్య స‌మ‌స్య‌లకు గురి అవుతూ ఉంటారు. అధిక బ‌రువు కార‌ణంగా కీళ్ల నొప్పులు, ర‌క్త‌పోటు, షుగ‌ర్, థైరాయిడ్, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ఇలా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతూ ఉంటాయి. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. మ‌న వంటింట్లో ఉండే దినుసుల‌తో ఒక పానీయాన్నీ త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల అధిక బ‌రువుతో పాటు వేలాడే పొట్ట కూడా త‌గ్గుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వేలాడే పొట్ట‌ను, అధిక బ‌రువును త‌గ్గించే ఈ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పానీయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం దాల్చిన చెక్క‌ను, నిమ్మ‌ర‌సాన్ని, తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా దాల్చిన చెక్క‌ను పొడిగా చేసి గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, అర చెక్క నిమ్మ‌ర‌సం, ఒక టీ తేనె వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి. ఇలా నెల రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో వ‌చ్చిన మార్పును మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అలాగే ఈ పానీయాన్ని తీసుకున్న గంట వ‌ర‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు. ఈ విధంగా దాల్చిన చెక్క‌తో త‌యారు చేసిన పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు జీల‌క‌ర్ర క‌షాయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Belly Fat Drink take this daily for effective results
Belly Fat Drink

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో పావు టీ స్పూన్ జీల‌క‌ర్ర పొడిని వేసి క‌లిపి తాగాలి. ఈ విధంగా రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున‌, అలాగే రాత్రి పూట మ‌రొక‌సారి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వేలాడే పొట్ట‌ను, అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు తెలియజేస్తున్నారు. ఉద‌యం పూట జీల‌క‌ర్ర నీటిని తాగినా గంట వ‌ర‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు. అలాగే రాత్రి భోజ‌నం చేసిన అర గంట త‌రువాత జీల‌క‌ర్ర నీటిని తాగాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. వీటితో పాటు ప్ర‌తిరోజూ వ్యాయామం చేయాలి. జంక్ ఫుడ్ ను, నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి. ప‌చ్చి ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

D

Recent Posts