Teeth : నేటి కాలంలో చాలా మంది టీ, కాఫీలను ఎక్కువగా తాగుతున్నారు. అలాగే తీపి పదార్థాలను, చాకొలెట్ లను, శీతల పానీయాలను అధికంగా తీసుకుంటున్నారు. దీని వల్ల దంతాలు గార పట్టడం, దంతాలు మరియు చిగుళ్లు అనారోగ్యానికి గురవ్వడం జరుగుతుంది. ప్రతి రోజూ దంతాలను శుభ్రం చేసుకున్నప్పటికీ ఈ గార తొలగిపోదు. దంతాలపై గారను అలాగే ఇతర దంత సమస్యలను కొన్ని రకాల చిట్కాల ద్వారా తొలగించుకోవచ్చు. పచ్చగా మారిన దంతాలను మనం ఈనో ను ఉపయోగించి తెల్లగా మార్చుకోవచ్చు.
దీనిలో బేకింగ్ సోడా అధికంగా ఉంటుంది. అది దంతాలను తెల్లగా మర్చడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గాను ఈనో పౌడర్ ను, ఒక నిమ్మచెక్కను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఈనో పౌడర్ ను వేయాలి. తరువాత అందులో నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేలితో కానీ, బ్రష్ తో కానీ తీసుకుని దంతాలను 2 నిమిషాల పాటు బాగా శుభ్రపరుచుకోవాలి. తరువాత నోటిని శుభ్రంగా కడుక్కోవాలి.
వారానికి రెండు నుండి మూడుసార్లు ఈ చిట్కాను పాటించడం వల్ల దంతాలపై పేరుకుపోయిన గారె తొలగిపోయి దంతాలు తెల్లగా మారుతాయి. అంతేకాకుండా ఈ చిట్కాను పాటించడం వల్ల నోట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. పిప్పి పళ్ల సమస్య కూడా తగ్గుతుంది. దంతాలను తెల్లగా మార్చే మరో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన వంటింట్లో ఉండే వాటితోనే మనం దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు.
ఇందుకోసం ఉప్పు, పసుపు, నిమ్మచెక్కను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక నిమ్మచెక్కను తీసుకుని దానిపై కొద్దిగా ఉప్పును, చిటికెడు పసుపును వేయాలి. ఈ నిమ్మచెక్కతో దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై గార తొలగిపోతుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల నిమిషాల వ్యవధిలోనే చక్కటి ఫలితాలను పొందవచ్చు. అలాగే మనం రోజూ ఉపయోగించే టూత్ పేస్ట్ కు కొద్దిగా ఉప్పును కలిపి దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి.
ఇలా చేయడం వల్ల కూడా దంతాలు తెల్లగా మారతాయి. అలాగే నిమ్మకాయను నిలువుగా కోసి దానిపై ఉప్పు చల్లి దానితో దంతాలను శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై గార తొలగిపోతుంది. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియాలను నశింపజేసి నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. దంతాలను గట్టి పరుస్తుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల దంతాలపై గార తొలగిపోవడంతోపాటు దంతాలు గట్టిగా, ఆరోగ్యంగా తయారవుతాయి.