Lemon Drink : స్థూలకాయం.. ఇది ప్రతి ఒక్కరినీ కుంగదీస్తున్న సమస్య. హార్ట్ ఎటాక్, షుగర్ వంటి వ్యాధులు మన పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కారణంగా వస్తాయి. ఒక్కప్పుడు కొద్దిగా వ్యాయామం, కొద్దిగా వాకింగ్ చేస్తే బరువు తగ్గేవారు. కానీ ఇప్పుడు ఏం చేసినా బరువు తగ్గడం లేదని చాలా మంది బాధపడుతున్నారు. దీనికి ప్రధానం కారణం జీవక్రియల రేటు తగ్గడం. వయసు పెరిగే కొద్దీ ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తి తగ్గుతుంది. మనం ఎంత ఆహారాన్ని తీసుకున్నా కానీ అందులో కొద్ది శాతాన్ని మాత్రమే శరీరం జీర్ణించుకుంటుంది. మిగిలిందంతా కొవ్వు రూపంలో పేరుకుని పోతుంది.
శరీరానికి ఆహారం అందకపోవడం ద్వారా నీరసం వస్తుంది. దాంతో మనం మరింత ఆహారాన్ని తీసుకుంటాం. దాని కారణంగా శరీరంలో కొవ్వు మరింత పేరుకుపోతుంది. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించాలంటే మనం జీవక్రియల రేటును పెంచాలి. దీని కోసం మనం ఒక పానీయాన్ని తయారు చేసుకుని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ పానీయాన్ని తయారు చేయడానికి అల్లం మరియు నిమ్మరసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. శరీరం యొక్క జీవక్రియల రేటును పెంచడంలో అల్లం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి.
అలాగే కొవ్వును కరిగించి బరువును తగ్గించే గుణాలు కూడా అల్లంలో అధికంగా ఉన్నాయి. రోజూ ఆహారంలో భాగంగా అల్లాన్ని తీసుకోవడం వల్ల పొట్ట, నడుము దగ్గర పేరుకుపోయిన కొవ్వు సులభంగా కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే నిమ్మకాయ కూడా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి, పీచు పదార్థాలు, సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. ఐరన్ లోపంతో బాధపడే వారు తొందరగా నీరసించే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఎక్కువ క్యాలరీలు ఉన్న చిరుతిళ్లను తినడానికి బదులుగా నీళ్లల్లో నిమ్మరసాన్ని, తేనెను కలిపి తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభించడమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది.
నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి వ్యాధులు మన దరి చేరకుండా ఉంటాయి. అల్లం మరియు నిమ్మరసంతో పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే నిమ్మరసం, నిమ్మరసం తీయగా మిగిలిన నిమ్మ చెక్కలను ముక్కలుగా చేసి వేయాలి. అలాగే కచ్చా పచ్చగా దంచిన అల్లం ముక్కలను కూడా వేసి నీటిని బాగా మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ నీటిని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరగడంతోపాటు బరువు కూడా తగ్గుతారు.