Burning Sensation In Feet : అరికాళ్ల మంట‌లు కార‌ణాలు.. ఎలా త‌గ్గించుకోవాలి..?

Burning Sensation In Feet : మ‌న‌లో చాలా మంది అరికాళ్లు, అరి చేతుల్లో మంట‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఇలా అరికాళ్ల‌ల్లో మంట‌లు రావ‌డానికి ప్రధానంగా రెండు కార‌ణాలు ఉంటాయి. అందులో మొద‌టిది విట‌మిన్ బి 12 లోపం. అలాగే రెండోది షుగ‌ర్ వ్యాధి. వ‌య‌సు పైబ‌డ‌డం వ‌ల్ల కొంద‌రిలో విట‌మిన్ బి 12 లోపం త‌లెత్తుతుంది. ఈ విట‌మిన్ లోపించ‌డం వ‌ల్ల కూడా అరిచేతుల్లో, అరికాళ్ల‌ల్లో మంట‌లు వ‌స్తూ ఉంటాయి. విట‌మిన్ బి 12 ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఈ మంట‌లు త‌గ్గుతాయి. అలాగే షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల్లో కూడా అరికాళ్ల‌ల్లో మంట‌లు వ‌స్తూ ఉంటాయి. ర‌క్త‌నాళాల్లో ఉండే క‌ణాల‌కు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ సులువుగా జ‌ర‌గ‌క‌పోవ‌డం వ‌ల్ల, ర‌క్త‌నాళాల‌పై ఉండే పొర‌లు దెబ్బ‌తిన‌డం వ‌ల్ల ఇలా మంట‌లు వ‌స్తూ ఉంటాయి.

ఇలా అరికాళ్లల్లో మంట‌ల‌తో బాధ‌ప‌డే వారు షుగ‌ర్ వ్యాధికి సంబంధించిన ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సి ఉంటుంది. షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటే అరికాళ్లల్లో మంట‌లు కూడా క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. అరికాళ్ల‌ల్లో మంట‌లు రావ‌డానికి గ‌ల కార‌ణాలను తెలుసుకుని త‌గిన చికిత్స తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. అరికాళ్ల‌ల్లో మంట‌ల స‌మ‌స్య మ‌రీ తీవ్రంగా ఉన్న‌వారు ప‌లు చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దీని కోసం ముందుగా ఒక పెద్ద గిన్నెలో చ‌ల్ల‌ని నీటిని తీసుకోవాలి. మ‌రో గిన్నెలో వేడి నీటిని తీసుకోవాలి. ముందుగా కాళ్ల‌ను వేడి నీటిలో 4 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత కాళ్ల‌ను బ‌య‌ట‌కు తీసి చ‌ల్ల‌టి నీటిలో 2 నిమిషాల పాటు ఉంచాలి. మ‌ర‌లా కాళ్ల‌ను తీసి మ‌రో 4 నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచాలి. ఇలా కాళ్ల‌ను 4 నిమిషాల పాటు వేడి నీటిలో 2 నిమిషాల పాటు చ‌ల్ల‌టి నీటిలో ఉంచాలి.

Burning Sensation In Feet causes and home remedies
Burning Sensation In Feet

నీటి వేడిద‌నం త‌గ్గే కొద్ది మ‌ర‌లా వేడి నీటిని పోస్తూ ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అరికాళ్లల్లో మంట‌లు త‌గ్గుతాయి. వేడి నీటిలో ఉంచ‌డం వ‌ల్ల కాళ్ల‌ల్లో వేడైన ర‌క్తం వెన‌క్కి నెట్ట‌బ‌డుతుంది. ఆ భాగాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌డానికి మ‌ర‌లా కాళ్ల‌ల్లోకి కొత్త ర‌క్తం వ‌స్తుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగుబ‌డి కాళ్ల‌ల్లో మంట‌లు త‌గ్గుతాయి. న‌రాల‌ల్లో ఉండే వాపు త‌గ్గుతుంది. న‌రాల‌పై ఉండే పొర దెబ్బ‌తిన‌కుండా ఉంటుంది. దీంతో అరికాళ్ల‌లో మంట‌లు సుల‌భంగా త‌గ్గుతాయి. అలాగే ఇంకొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

గుమ్మ‌డికాయ నుంచి గుజ్జు తీసి దాన్ని మెత్త‌ని పేస్ట్‌లా చేసి అరికాళ్ల‌లో ప‌ట్టించాలి. ఇలా చేస్తుంటే మంట‌లు త‌గ్గుతాయి. అలాగే రేగి చెట్టు ఆకుల‌ను, పెరుగును క‌లిపి మెత్త‌ని పేస్ట్‌లా చేసి అరికాళ్ల‌లో రాస్తున్నా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే గంధ‌పు చెక్క‌ను అర‌గ‌దీసి అనంత‌రం వ‌చ్చే గంధంలో ప‌చ్చ క‌ర్పూరం క‌లిపి మెత్త‌ని పేస్ట్‌లా చేసి రాస్తున్నా ఈ స‌మ‌స్య త‌గ్గుతుంది. దీంతోపాటు పాల‌ను చ‌ల్ల‌గా చేసి.. అంటే ఫ్రిజ్‌లో ఉంచి తాగాలి. దీంతో కూడా అరికాళ్ల‌లో మంట‌లు త‌గ్గుతాయి. ఇలా ప‌లు చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

D

Recent Posts