Rava Uttapam : ఉద‌యాన్నే ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు 5 నిమిషాల్లో దీన్ని చేసుకోవ‌చ్చు..!

Rava Uttapam : మ‌నం బొంబాయి ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ర‌వ్వ‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే త‌క్కువ స‌మ‌యంలో వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన రుచికర‌మైన వంట‌కాల్లో ర‌వ్వ ఊతప్పం కూడా ఒక‌టి. దీనిని కేవ‌లం 5 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా ర‌వ్వ‌తో ఊత‌ప్ప‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ర‌వ్వ ఊత‌ప్ప‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ర‌వ్వ ఊత‌ప్పం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ర‌వ్వ – ఒక క‌ప్పు, బంగాళాదుంప – పెద్ద‌ది ఒక‌టి, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – త‌గినంత‌, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ, క్యారెట్ తురుము – అర క‌ప్పు, వంట‌సోడా – ఒక టీ స్పూన్.

Rava Uttapam recipe in telugu make in this method
Rava Uttapam

ర‌వ్వ ఊత‌ప్పం త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో ర‌వ్వ‌ను తీసుకోవాలి. త‌రువాత దీనిని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఇందులోనే బంగాళాదుంప ముక్క‌ల‌న, త‌గినన్ని నీళ్ల‌ను పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వంట‌సోడా త‌ప్ప మిగిలిన ప‌దార్థాలన్నీ వేసి క‌ల‌పాలి. త‌రువాత వంట‌సోడా వేసి దానిపై కొద్దిగా నీళ్ల‌ను పోయాలి. వంట‌సోడా పొంగిన త‌రువాత మ‌రోసారి క‌లుపుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద క‌ళాయిని ఉంచి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క‌ళాయికి త‌గిన‌ట్టు రెండు లేదా మూడు గంటెల పిండిని తీసుకుని ఊత‌ప్పంలా వేసుకోవాలి.

త‌రువాత దీనిపై మూత పెట్టి చిన్న మంట‌పై కాల్చుకోవాలి. ఊత‌ప్పం ఒక వైపు వేగిన త‌రువాత మ‌రో వైపుకు తిప్పుకుని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ర‌వ్వ ఊత‌ప్పం త‌యార‌వుతుంది. దీనిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ర‌వ్వ‌తో అప్ప‌టికప్పుడు ఎంతో రుచిక‌ర‌మైన ఊత‌ప్ప‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts