Chicken Fried Biryani : చికెడ్ ఫ్రైడ్ బిర్యానీ.. ఎవ‌రైనా స‌రే చాలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Chicken Fried Biryani : చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే వంటకాల్లో బిర్యానీ కూడా ఒక‌టి. బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు ర‌క‌ర‌కాల బిర్యానీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన బిర్యానీల‌లో చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ కూడా ఒక‌టి. వేయించిన చికెన్ తో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ ల‌కు వెళ్లే అవ‌స‌రం లేకుండా ఇంట్లోనే దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీని సుల‌భంగా ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 4 టేబుల్ స్పూన్స్, యాల‌కులు – 3, ల‌వంగాలు – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, బిర్యానీ ఆకు – 1, క‌రివేపాకు – 3 రెమ్మ‌లు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Chicken Fried Biryani recipe in telugu very easy to make
Chicken Fried Biryani

మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – ఒక కిలో, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, కాశ్మీరి చిల్లీ కారం – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – అర టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, జీలక‌ర్ర పొడి – అర టీ స్పూన్, పొడవుగా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన కొత్తిమీర – ఒక చిన్న క‌ట్ట‌, పొడవుగా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ‌లు – 2, నూనె – 2 టేబుల్ స్పూన్స్.

అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అర గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం – 2 గ్లాసులు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – 2 టీ స్పూన్స్, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, జాప‌త్రి – కొద్దిగా, యాల‌కులు – 7, అనాస పువ్వులు – 2, ల‌వంగాలు – 6, మ‌రాఠీ మొగ్గ – 1, స్టోన్ ప్ల‌వ‌ర్ – కొద్దిగా, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 8, పొడవుగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నీళ్లు – 3 గ్లాసులు, ఉప్పు – త‌గినంత‌,చిన్న‌గా త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్న‌గా త‌రిగిన పుదీనా – కొద్దిగా.

చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో శుభ్ర‌ప‌రిచిన చికెన్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో మ్యారినేష‌న‌క్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత దీనిని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ ను చ‌క్క‌గా మ్యారినేట్ చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక యాల‌కులు, ల‌వంగాలు, దాల్చిన చెక్క‌, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. త‌రువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి క‌ల‌పాలి. ఈ చికెన్ ను క‌లుపుతూ మ‌ధ్య‌స్థ మంట‌పై 20 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత క‌రివేపాకు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ చికెన్ ను మ‌రో 5 నుండి 10 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. మ‌సాలా దినుసులు వేగిన త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు రంగు మారిన త‌రువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత నాన‌బెట్టుకున్న బాస్మ‌తీ బియ్యం వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇందులోనే ఉప్పు, కొత్తిమీర‌, పుదీనా వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి ఆవిరి అంతా పోయి పొడి పొడిలాడే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి దీనిపై వేయించిన చికెన్ ను వేసి మూత పెట్టాలి. దీనిని ఇలాగే మ‌రో 5 నిమిషాల పాటు ఉంచిన త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వీకెండ్స్ లో స్పెష‌ల్ డేస్ లో ఇలా చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts