Cinnamon And Turmeric Tea : మనకు సులభంగా లభించే పదార్థాలతో ఈ పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ పానీయాన్ని తాగడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీరం బలంగా తయారవుతుంది. నీరసం, అలసట వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలో క్యాల్షియం లోపం రాకుండా ఉంటుంది. అలాగే ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి.
అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి సులభంగా బరువు తగ్గవచ్చు. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్నవివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం దాల్చిన చెక్క ముక్కను, అర టీ స్పూన్ సోంపును, పావు టీ స్పూన్ పసుపును, రెండు యాలక్కాయలను, పావు టీ స్పూన్ బెల్లం తురుమును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోయాలి.
తరువాత ఇందులో యాలకులు, దాల్చిన చెక్క, సోంపు, పసుపు వేసి కలపాలి. ఈ నీటిని 5 నిమిషాల పాటు మరిగించిన తరువాత పావు టీ స్పూన్ బెల్లం తురుమును వేసి మరో రెండు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఇందులో బెల్లాన్ని ఉపయోగించకపోవడమే మంచిది. అలాగే గ్యాస్ సమస్య ఉన్న వారు ఈ నీటిని అల్పాహారం చేసిన అరగంట తరువాత తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా 15 రోజుల పాటు తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. క్యాల్షియం లోపం, కీళ్ల నొప్పులు, అలసట, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడే వారు ఈ విధంగా పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.