Cloves For Teeth : మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చక్కటి చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా దంతాలను తెల్లగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల దంతాలపై ఉండే గార, పసుపుదనం తొలగిపోయి దంతాలు తెల్లగా మారతాయి. ఈ చిట్కాను తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా సులభం. దంతాలను తెల్లగా మార్చే ఆ చిట్కా ఏమిటి..దీనిని ఎలా తయారు చేసుకోవాలి..ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం లవంగాలను ఉపయోగించాల్సి ఉంటుంది. దంతాలపై ఉండే పసుపుదనాన్ని తొలగించి దంతాలను తెల్లగా మార్చడంలో అలాగే దంతాలు పుచ్చిపోకుండా వాటి ఆరోగ్యాన్ని కాపాడడంలో లవంగాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోట్లో ఉండే బ్యాక్టీరియాను నశింపజేసి దంతాల మరియు చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో దోహదపడతాయి. దీని కోసం ముందుగా ఒక జార్ లో లవంగాలను వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లవంగాల పొడిని అర టీ స్పూన్ మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే రెండు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచుకుని వేసుకోవాలి. తరువాత ఇందులో అర టీ స్పూన్ ఉప్పును, మనం ప్రతిరోజూ ఉపయోగించే టూత్ పేస్ట్ ను రెండు టీ స్పూన్ల మోతాదులో వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని టూత్ బ్రష్ తో తీసుకుని మనం సాధారణంగా దంతాలను ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల దంతాలపై పేరుకుపోయిన గార, పసుపు అంతా తొలగిపోయి దంతాలు తెల్లగా మారతాయి. అలాగే ఈ చిట్కాను వాడడం వల్ల దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దంతాలు పుచ్చిపోయే దశలో ఉన్నవారు ఈ చిట్కాను రెండు వారాల పాటు వాడడం వల్ల దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల దంతాలు తెల్లగా మారడంతో నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.