Cough Home Remedies : మనల్ని వేధించే శ్వాస సంబంధిత సమస్యల్లో పొడి దగ్గు కూడా ఒకటి. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. పొడి దగ్గు కారణంగా మనతో పాటు మన చుట్టూ ఉండే వారు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. పని చేసే చోట, ఆఫీస్ లల్లో ఈ పొడి దగ్గు కారణంగా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా పొడి దగ్గు కారణంగా రాత్రి పూట నిద్ర కూడా సరిగ్గా ఉండదు. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి సిరప్ లను, మందులను,యాంటీ బయాటిక్ లను వాడుతూ ఉంటారు. మందులను వాడినప్పటికి ఈ సమస్య నుండి బయటపడడానికి సమయం ఎక్కువగా పడుతుంది. ఎటువంటి మందులు వాడే అవసరం లేకుండా కేవలం సహజ సిద్ద చిట్కాను ఉపయోగించి చాలా తక్కువ సమయంలో మనం ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.
పొడి దగ్గు ఇబ్బంది పెడుతున్నప్పుడూ ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా కేవలం గోరు వెచ్చని నీటిని తాగాలి. అయితే చాలా మంది నీటిని కొద్దిగా వేడి చేసుకుని తాగుతూ ఉంటారు. ఇలా అస్సలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. పొడి దగ్గు ఇబ్బంది పెడుతున్నప్పుడూ నీటిని ఎక్కువ మొత్తంలో కాచి చల్లార్చి నిలువ చేసుకోవాలి. నీటిని తాగినప్పుడల్లా ఇలా కాచి చల్లార్చిన నీటినే గోరు వెచ్చగా చేసుకుని తాగుతూ ఉండాలి. అలాగే ఈ నీటిని కాఫీలా కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి. ఇలా గోరు వెచ్చని నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. అలాగే ఈ నీటిని తాగుతూనే నీరసం రాకుండా మధ్య మధ్యలో అదే గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇలా తేనె నీటిని 4 సార్లు, గోరు వెచ్చని నీటిని 10 నుండి 12 సార్లు తాగుతూ ఉండాలి. ఇలా ఆహారాన్ని తీసుకోకుండా నీటిని తాగి ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ లు త్వరగా తగ్గు ముఖం పడతాయి.
ఇలా నీటిని తాగుతూనే 5 నుండి 6 టీ స్పూన్ల తేనెను చప్పరిస్తూ ఉండాలి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పొడిదగ్గుకు కారణమయ్యే ఇన్ఫెక్షన్ లను తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఈ విధంగా 2 నుండి 3 రోజుల పాటు కేవలం నీటిని తాగుతూ తేనెను తీసుకుంటూ ఉండాలి. ఇలా 3 రోజుల పాటు ఉన్న తరువాత మరుసటి రోజు నుండి ఉదయం 11 గంటలకు అలాగే సాయంత్రం 4 గంటలకు మనకు అందుబాటులో ఉండే పండ్లను తీసుకోవాలి. మిగిలిన సమయంలో నీటిని తాగుతూ ఉండాలి. ఇలా దగ్గు పూర్తిగా తగ్గే వరకు చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతుంది. రాత్రి సమయంలో దగ్గు వల్ల నిద్రకు ఆటంకం కలగకుండా ఉంటుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మరలా పొడి దగ్గు సమస్య రాకుండా ఉంటుంది.