Dark Circles Home Remedies : క‌ళ్ల కింద న‌లుపు త‌గ్గించే టాప్ రెమెడీస్‌.. ఇలా చేయండి చాలు..!

Dark Circles Home Remedies : మ‌న‌లో చాలా మందికి క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలు వ‌స్తూ ఉంటాయి. క‌ళ్ల కింద న‌లుపు ఎక్కువ‌గా ఉంటుంది. ఈ స‌మ‌స్యతో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. క‌ళ్ల‌కింద ఇలా న‌ల్ల‌గా ఉండ‌డం వ‌ల్ల ముఖం కూడా చూడ‌డానికి అంత అందంగా క‌నిపించ‌దు. ఇలా క‌ళ్ల కింద న‌ల్ల‌టి వల‌యాలు రావ‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయి. వంశ‌పార‌ప‌ర్యంగా కొంద‌రికి క‌ళ్ల కింద న‌లుపు వ‌స్తుంది. అలాగే ఆస్థ‌మా ఉన్న వారిలో, ముక్కు అల‌ర్జీలు ఎక్కువ‌గా ఉన్న‌వారిలో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది. ఆస్థమా, అల‌ర్జీల కార‌ణంగా వాటికి వాడే మందుల కార‌ణంగా ముక్కు భాగంలో ఇన్ ప్లామేష‌న్ ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటుంది.

దీని కార‌ణంగా క‌ళ్ల కింద న‌ల్ల‌టి వల‌యాలు ఎక్కువ‌గా వ‌స్తాయి. అలాగే ర‌సాయ‌నాలు క‌లిగిన క్రీముల‌ను, లోష‌న్ లను వాడ‌డం వ‌ల్ల కూడా క‌ళ్ల కింద న‌లుపు ఎక్కువ‌గా వ‌స్తుంది. అలాగే నిద్రలేమి కార‌ణంగా కూడా క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలు ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి. అలాగే ఎండ కార‌ణంగా కూడా క‌ళ్ల కింద న‌లుపు వ‌స్తుంది. నీటిని త‌క్కువ‌గా తాగ‌డం వ‌ల్ల‌, ఆల్క‌హాల్ ను ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల, శ‌రీరంలో విట‌మిన్ సి త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కళ్ల కింద న‌లుపు ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటుంది. ఇలా క‌ళ్ల కింద న‌లుపు రాకుండా ఉండాలంటే మ‌నం మ‌న జీవ‌న విధానంలో మార్పు చేసుకోవాలి. రోజూ 4 నుండి 5 లీట‌ర్ల నీటిని తాగాలి. నిద్రలేమి లేకుండా చూసుకోవాలి. రోజూ త‌గినంత నిద్ర పోవాలి. అలాగే విట‌మిన్ ఎ, విట‌మిన్ సి ఎక్కువ‌గా ఆహారాల‌ను తీసుకోవాలి. ఉద‌యం పూట క్యారెట్, బీట్ రూట్, ట‌మాటాల‌తో జ్యూస్ చేసి తీసుకోవాలి.

Dark Circles Home Remedies follow these for effective results
Dark Circles Home Remedies

అలాగే సాయంత్రం పూట బ‌త్తాయి, క‌మ‌లా పండ్లతో జ్యూస్ చేసి తీసుకోవాలి. ఇలా జ్యూస్ ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ ఎ, సి ల‌భిస్తాయి. దీంతో క‌ళ్ల కింద న‌లుపు త‌గ్గుతుంది. అలాగే విట‌మిన్ కె ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. విట‌మిన్ కె ఎక్కువ‌గా ఆకుకూర‌ల‌ల్లో ఉంటుంది. రోజూ ఆహారంలో భాగంగా ఒక ఆకుకూర‌ను తీసుకోవాలి. ఆకుకూర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా క‌ళ్ల కింద న‌లుపు త‌గ్గుతుంది. అలాగే ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి వీలైనంత వ‌ర‌కు బ‌య‌ట‌ప‌డాలి. ఒత్తిడి ద‌రి చేర‌కుండా చూసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల క‌ళ్ల కింద న‌లుపు తగ్గ‌డంతో పాటు మ‌ర‌లా రాకుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల స‌మ‌స్య లేని వారికి కూడా రాకుండా ఉంటుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

D

Recent Posts