చిట్కాలు

కిడ్నీరాళ్లకు ఔషధం నారింజ రసం..!

కిడ్నీలో రాళ్లు బాధపెడుతున్నాయా? రోజుకో గ్లాసు నారింజపండ్ల రసం తాగితే చాలు… రాళ్ల బాధ మాయమవుతుంది. ఇటీవలి పరిశోధనల్లో తేలిన నిజం ఇది. ఎన్నిసార్లు శస్త్రచికిత్స చేయించుకున్న చాలా మందిని కిడ్నీలో రాళ్ల సమస్య మళ్లీ మళ్లీ బాధపెడుతుంటుంది. ప్రతి రోజూ నారింజ పండ్లరసం తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చంటున్నారు పరిశోధకులు.

కాల్షియం వంటి రసాయనాల గాఢత విపరీతంగా పెరిగిపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఆపరేషన్ ద్వారా వీటిని తొలగించినప్పటికి తిరిగి మళ్లీ రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి. పొటాషియం సిట్రేట్ సప్లిమెంట్లు వాడడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు నివారించవచ్చు. కాని కొందరిలో ఇవి జీర్ణవ్యవస్ధకు సంబంధించిన దుష్ప్రభావాలను కలిగిస్తాయి.

drinking orange juice daily can prevent kidney stones

కాబట్టి ఈ సప్లిమెంట్ల కన్నా సహజసిద్ధమైన సిట్రేట్‌లు లభించే సిట్రస్ ఫలాలను తీసుకోమని సూచిస్తుంటారు వైద్యనిపుణులు. అయితే మిగిలిన సిట్రస్ ఫలాల కన్నా నారింజపండ్లలోని సిట్రేట్లు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాయని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. మూత్రం ఆమ్లత్వాన్ని తగ్గించడం ద్వారా ఈ సిట్రేట్లు రాళ్లు ఏర్పడడాన్ని నివారిస్తాయి. అందువల్ల నిమ్మరసం కన్నా కూడా నారింజ పండ్లరసం తీసుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం అని సూచిస్తున్నారు అధ్యయనకారులు.

Admin

Recent Posts