చిట్కాలు

Dry Amla Benefits : రోజూ వీటిని 2 ముక్క‌లు తినండి చాలు.. ఇమ్యూనిటీ పెరుగుతుంది..!

Dry Amla Benefits : ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరిని తీసుకోవడం వలన, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా, చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా, చిన్న వయసులోనే పెద్దవాళ్లల్లా కనపడుతున్నారు. వృద్ధాప్య లక్షణాలని తగ్గించేందుకు, ఉసిరి మనకి ఎంతో సహాయం చేస్తుంది. ఉసిరిని తీసుకుంటే, ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలని పొందడానికి అవుతుంది. ఉసిరికాయలను తెచ్చుకుని శుభ్రంగా కడిగేసి, ముక్కలు కింద తరుక్కుని ఎండబెట్టుకోవాలి.

బాగా ఎండిన ఉసిరిముక్కలని సంవత్సరం పొడుగునా, వాడుకోవచ్చు. ఉసిరిలో పోషకాలు బాగా ఎక్కువ ఉంటాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉసిరిలో ఎక్కువగా ఉంటాయి. కొల్లాజన్ కణజాలాన్ని రక్షించి, వృద్ధాప్య లక్షణాలని రాకుండా చూస్తుంది. ఉసిరికాయలులో యాంటీ ఏజింగ్ లక్షణాలు తో పాటుగా, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఉంటాయి. ఎండిపోయిన ఉసిరి ముక్కల్ని తింటే, వృద్ధాప్య లక్షణాలు తగ్గించుకోవచ్చు. దీన్ని పొడిగా తయారు చేసుకుని, తేనె కలిపి వేసుకుని తీసుకోవచ్చు.

dry amla benefits must know about them

చర్మం పై ముడతలు రాకుండా ఇది కాపాడుతుంది. ఉసిరి ఫ్రెష్ గా ఉన్నప్పుడు, ఉసిరి పచ్చడి లేదంటే కషాయం చేసుకుని కూడా తీసుకోవచ్చు. నోటి పూతని కూడా ఇది తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా ఉసిరిని వాడడం మంచిది. ఇలా ఉసిరితో, మనం ఈ సమస్యలకి చెక్ పెట్టవచ్చు. షుగర్ ఉన్నవాళ్లు ఉసిరిని తీసుకుంటే, దివ్య ఔషధంలా పనిచేస్తుంది.

కాబట్టి, షుగర్ ఉన్నట్లయితే రెగ్యులర్ గా ఉపయోగించడం మంచిది. అంతే కాకుండా, బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఉసిరిని తీసుకుంటే సులభంగా బరువు తగ్గడానికి అవుతుంది. ఉసిరిని మనం జ్యూస్ కింద కూడా తీసుకోవచ్చు. మార్కెట్లో ఉసిరి జ్యూస్ దొరుకుతుంది. దాన్నైనా తీసుకోవచ్చు లేదంటే ఫ్రెష్ గా తయారు చేసుకునే తీసుకోవచ్చు.

Share
Admin

Recent Posts