Arthritis : ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య వ‌చ్చిన వారిలో ఆరంభంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

Arthritis : ఆర్థ‌రైటిస్ అనేది స‌హ‌జంగా వృద్ధుల్లో వ‌స్తుంటుంది. కీళ్లు, ఎముక‌లు బ‌ల‌హీనంగా మార‌డం వ‌ల్ల లేదా కాల్షియం లోపం వ‌ల్ల‌, వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల‌.. ఇలా ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. అయితే ఈ స‌మ‌స్య వ‌చ్చిన వారిలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవేమిటంటే..

Arthritis starting symptoms you should not ignore them

1. ఆర్థరైటిస్ స‌మ‌స్య ఉన్న‌వారిలో శ‌రీరంలోని ప‌లు భాగాల్లో నొప్పులు వ‌స్తుంటాయి. కొద్దిగా క‌దిలినా.. ఎక్క‌డైనా ఒక చోట నొప్పి వ‌స్తుంటుంది. ఇక కీళ్ల భాగాల్లోనూ నొప్పిగా ఉంటుంది. ఇలా నొప్పి వ‌స్తుంటే దాన్ని ఆర్థరైటిస్ ల‌క్ష‌ణంగా భావించాలి.

2. ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య ఉన్న‌వారిలో కీళ్ల భాగంలో వాపులు క‌నిపిస్తాయి. అయితే కొన్ని ర‌కాల వాపులు పలు కార‌ణాల వ‌చ్చినా వెంట‌నే పోతాయి. కొన్ని గంట‌ల్లో వాపులు త‌గ్గ‌కుండా రోజుల త‌ర‌బ‌డి అలాగే ఉంటే అప్పుడు దాన్ని ఆర్థ‌రైటిస్‌గా అనుమానించాలి. దీంతో వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స తీసుకోవాలి.

3. ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య ఉన్న‌వారిలో ఉద‌యం నిద్ర‌లేస్తూనే శ‌రీర భాగాల‌న్నీ ప‌ట్టుకుపోయిన‌ట్లు బిగుతుగా మారుతాయి. ఇలా ఉంటే క‌చ్చితంగా అది ఆర్థ‌రైటిస్ స‌మ‌స్యేన‌ని గుర్తించాలి.

4. ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య ఉన్వారు స‌రిగ్గా కూర్చోలేరు, నిల‌బ‌డ‌లేరు. కీళ్ల‌ను క‌దిలించాలంటే బాగా నొప్పిగా ఉంటుంది.

5. ఎలాంటి శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోయినా ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా కీళ్ల నొప్పులు వ‌స్తుంటే దాన్ని కూడా ఆర్థ‌రైటిస్‌గా అనుమానించాలి.

పై ల‌క్ష‌ణాలు అన్నీ ఆర్థ‌రైటిస్ వ‌చ్చిన వారిలో ఆరంభంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు. వీటిని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలి. దీంతో స‌మ‌స్య‌ను త్వ‌ర‌గా గుర్తించి చికిత్స తీసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. లేదంటే ఇంకా నొప్పులు, వాపులు తీవ్ర‌త‌రం అవుతాయి.

Share
Editor

Recent Posts