చిట్కాలు

దగ్గు సమస్యతో సతమతమవుతున్నారా.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి..

అసలే కరోనా కాలం.. పైగా వర్షాకాలం మొదలవడంతో అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా దగ్గు సమస్యలతో బాధపడేవారు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నప్పటికీ ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. ఈ క్రమంలోనే దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి ఈ వంటింటి చిట్కాలను పాటిస్తే తొందరగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

తీవ్రమైన దగ్గు సమస్యతో బాధపడే వారికి తేనె ఒక మంచి ఔషదం అని చెప్పవచ్చు. తేనెలో ఎన్నో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు దాగి ఉన్నాయి కనుక ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలోకి తేనె కలుపుకొని తాగడం ద్వారా దగ్గు నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు.

follow these home remedies to get relief from cough

అదేవిధంగా మన ఇంట్లో ఎన్నో వంటలలో ఉపయోగించే వెల్లుల్లి దగ్గుకు ఒక మంచి పరిష్కార మార్గం.వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి కనుక ప్రతి రోజు మనం వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా దగ్గు సమస్యతో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు వెల్లుల్లిని వేయించి, ఒక చెంచా తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది.

వంటింట్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో పసుపుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి కనుక పసుపును ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు.దగ్గు సమస్యతో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం వల్ల దగ్గు నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు.

Share
Admin

Recent Posts